Suchitra : ప్రముఖ సింగర్ సుచిత్ర (Singer Suchitra) వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ (Hot Topic) గా మారింది. ఇటీవల తన మాజీ భర్త కార్తిక్ లాగే నటుడు ధనుష్, కమల్ హసన్ వంటి ప్రముఖులు స్వలింగ సంపర్కులంటూ ఓ యూట్యూబ్ ఛానల్ (YouTube Channel) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు వారంతా కొకైన్ తీసుకుంటారని, అందుకే భార్యలతో విడాకులు తీసుకున్నారని ఆరోపించింది. అయితే తాజాగా సుచిత్రకు మాజీ భర్త షాక్ ఇచ్చాడు. ఆమెపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యాడు.
ఈ మేరకు సుచిత్రా మాట్లాడుతూ.. 'హీరో ధనుష్ గే. మద్యం నా మాజీ భర్త కార్తీక్ తో ఒకే గదిలో ఉండేవాడు. కమల్ హాసన్ (Kamal Hassan) ఇచ్చే పార్టీల్లో డ్రగ్స్ వినియోగం ఉంటుంది' అంటూ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది. దీంతో సుచిత్రా ఆరోపణలపై స్పందింఇన తన మాజీ భర్త కార్తీక్.. ఆమెపై చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. తన పరువుకు భంగం వాటిల్లే విధంగా సుచిత్ర కామెంట్స్ చేసిందంటూ లీగల్ నోటీసులు పంపించాడు. ఆమె మాట్లాడిన వీడియోస్ వెంటనే తొలగించాలంటూ సదరు యూట్యూబ్ ఛానల్ కు నోటీసులు పంపించాడు. ఆ వీడియోస్ పూర్తిగా తమ పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని, ఆ ఛానెల్లను రద్దు చేయాలని నోటీసులలో పేర్కొన్నాడు. ఆమె ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయకుండా చూడాలని లీగల్ టీమ్ ద్వారా డిమాండ్ చేశాడు.
Also Read : కాంగ్రెస్ 5 శాతం కూడా ఇలా చేయలేకపోయింది.. చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు..!