Ex DSP Praneeth Rao Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఓ మీడియా సంస్థ యజమాని ఇచ్చిన నెంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లు SIB అధికారులు గుర్తించారు. ఓ బీఆర్ఎస్ నేత ఇచ్చిన ఆదేశాల మేరకే ఇలా చేసినట్లు ప్రణీత్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది.

New Update
Praneeth: హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్.. బ్లాక్ మెయిల్ చేసి బాగా వాడేసిన పోలీస్ బాస్!

Ex DSP Praneeth Rao Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిసి ఎస్ఐబీలోని టాపింగ్ డివైస్ మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు ప్రణీత్ విచారణలో తెలిపారు. మరొక సారి ఈ డివైస్ పనికిరాకుండా చేసినట్లు తెలుస్తోంది. డివైస్ ని ధ్వంసం చేసి అందులో హార్డ్ డిస్క్ మొత్తాన్ని పగలగొట్టి అడవుల్లో వేసినట్లు విచారణలో అధికారులకు తెలిపారు. అయితే.. ప్రణీత్ చెప్పిన వివరాల ప్రకారం అడవుల్లో పడేసిన డివైస్ ను పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ALSO READ: టీడీపీలో టికెట్ల లొల్లి.. చంద్రబాబు నివాసం ఎదుట ఆందోళనలు

ప్రముఖ మీడియా హస్తం..!

మరోవైపు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వెనకాల ఓ మీడియా సంస్థ యజమాని ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్త చేస్తున్నారు. ఒక మీడియా సంస్థ యజమాని ఇచ్చిన నెంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేశాడని.. ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించేందుకు ఆ మీడియా సంస్థ యజమాని దగ్గర సర్వర్ పెట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కోసం వరంగల్ తో పాటు సిరిసిల్లలో వేరు వేరు రెండు సర్వర్లను ప్రణీత్ రావు ఏర్పాటు చేసినట్లు గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక కీలక నేత ఆదేశాలతో ప్రణీత్ రావు ఆనాటి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. త్వరలో ఆ మీడియా సంస్థ అధినేత, అలాగే బీఆర్ఎస్ నేతను SIB అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది.

అసలేం జరిగింది..

గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) చేశారనే ఆరోపణలు ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు పై ఉన్నాయి. దీనిపై కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన్ను విధుల్లో నుంచి తప్పించింది రేవంత్ సర్కార్. అయితే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సస్పెన్షన్‌కు గురైన ఎస్ఐబీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు అంశంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఎస్ఐబీలోని ఎస్ఓటి టీంలో కీలకంగా ఆయన వ్యవహరించారు. ఎస్ఐబీ ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి రికార్డులను ప్రణీత్ రావు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు.

42 హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు ఎత్తుకెళ్లినట్లు తేల్చారు. 1600 పేజీల కాల్ డేటాను ప్రణీత్ రావు తగులబెట్టినట్లు నిర్ధారించారు. కీలకమైన ఎస్ఓటి లాకర్ రూంలోని ఫైల్స్ మొత్తం ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పోలీసు శాఖ గుర్తించింది. కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు.. కాల్ రికార్డులు కొన్ని ఐఎంఈ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాని కూడా నాశనం చేసినట్లు గుర్తించారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ తయారు చేసిన డేటా మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు పేర్కొంది. హెచ్ డీడీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని కూడా ధ్వంసం చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది.

Advertisment
తాజా కథనాలు