చండీగఢ్ కోర్టులో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ ఐఆర్‌ఎస్ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తి నీటిపారుదల శాఖలో ఐఆర్‌ఎస్ అధికారిగా పనిచేస్తున్నాడు. అతడి మామ మాల్విందర్ సింగ్ సిద్ధూ పంజాబ్ పోలీసు అసిస్టెంట్ ఐజీగా పనిచేశాడు. ప్రస్తుతం ఇతడు సస్పెషన్సన్‌లో ఉన్నాడు. అయితే కొంతకాలంగా హర్‌ప్రీత్ సింగ్, మాల్విందర్ సింగ్ కుటుంబాల మధ్య గొడవలు నడుస్తున్నాయి. దీంతో వీళ్లు కుటుంబ కోర్టుకు వచ్చారు. వారి సమస్యను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ సెషన్‌కు హాజరయ్యారు.
Also Read: మూడు నెలల్లో ఆ పనులు పూర్తి చేయండి: మంత్రి పొంగులేటి
అయితే మాల్విందర్ సింగ్ బాత్‌రూంకు వెళ్తానంటూ బయటకు వచ్చాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన అల్లుడిపై తుపాకితో కాల్పులకు పాల్పడ్డాడు. తుపాకీ శబ్దం రావడంతో లోపల ఉన్నవాళ్లందరూ షాక్‌కు గురయ్యారు. రక్తపు మడుగులో ఉన్న హర్‌ప్రీత్ సింగ్‌ను ఆస్పత్రికి తరలించగా.. మార్గంలోనే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Also Read: అమెరికా తో పోటీ పడాలంటే భారత్ కు 75 ఏళ్లు పడుతుంది..వరల్డ్ బ్యాంక్!