Andhra Pradesh : వైసీపీ కార్యాలయం కూల్చివేత.. జగన్ ఏం అన్నారంటే

తాడేపల్లిలో ఈరోజు తెల్లవారుజామున వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడంపై సీఎం జగన్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఏపీలో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారంటూ విమర్శించారు.

New Update
YCP Offices: వైసీపీ ఆఫీసుల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు!

YS Jagan : తాడేపల్లి (Tadepalle) లో ఈరోజు తెల్లవారుజామున వైసీపీ (YCP) కార్యాలయాన్ని సీఆర్‌డీఏ (CRDA) అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ ఎక్స్ వేదికగా స్పందిచారు. 'ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు.

Also Read: ఏపీలో రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు.. ఈరోజే స్పీకర్ ఎన్నిక

రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు (Chandrababu), ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నానని' అన్నారు.

Also Read: జగన్ కు ప్రతిపక్ష నేత హోదా.. అచ్చెన్నాయుడు ఏమన్నారంటే?

Advertisment
తాజా కథనాలు