Delhi: ఉగ్రవాదిగా మారిన మాజీ సైనికుడు.. పాక్‌ టెర్రరిస్టులతో కలిసి భారీ కుట్ర

ఉగ్రవాదిగా మారి పాక్ టెర్రరిస్టులకు సహకరిస్తున్న మాజీ ఆర్మీ అధికారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని కుప్వారాకు చెందిన రియాజ్‌ అహ్మద్‌గా గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు పీవోకేలోని లష్కరే నాయకులతో చేతులు కలిపినట్లు వెల్లడించారు.

Delhi: ఉగ్రవాదిగా మారిన మాజీ సైనికుడు.. పాక్‌ టెర్రరిస్టులతో కలిసి భారీ కుట్ర
New Update

Ex-soldier: ఓ మాజీ సైనికుడు ఉగ్రవాదిగా మారడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. జమ్మూకశ్మీర్‌లో ఓ ఉగ్ర కుట్రను భగ్నం చేసే క్రమంలో ఈ విస్తుపోయే నిజం బయటపడ్డట్లు ఢిల్లీ (Delhi) పోలీసులు తెలిపారు. ఈ మేరకు సైన్యం నుంచి పదవీ విరమణ చేసి ఉగ్రవాదిగా మారిన వ్యక్తిని కుప్వారాకు చెందిన మాజీ ఆర్మీ అధికారిని రియాజ్‌ అహ్మద్‌గా గుర్తించిన పోలీసులు.. ఫిబ్రవరి 4వ తేదీన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో అరెస్టు చేసినట్లు తెలిపారు.

రియాజ్‌ అహ్మద్‌..
ఇక లష్కరే తోయిబాకు చెందిన రియాజ్‌ అహ్మద్‌ జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు అతడి సహచరులతో కలిసి ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం వారు పాక్‌లో టెర్రరిస్టు హ్యాండ్లర్‌ నుంచి ఆయుధాలు, మందుగుండు తెప్పించేందుకు కుట్ర పన్నారు. వీటితో దాడులు చేయాలనేది వారి లక్ష్యమని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి : Allahabad: యూనివర్సిటీలో దారుణం.. విద్యార్థినిపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లైంగిక దాడి

కశ్మీర్‌ నుంచి ఆయుధాలు..
'జమ్మూకశ్మీర్‌లోని కుప్‌వాడా జిల్లాలో దాడుల కుట్రను ఇటీవలే భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి ఆయుధాల స్మగ్లింగ్‌కు ప్రయత్నిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశాం. ఈ క్రమంలో జహూర్‌ అహ్మద్‌ భట్‌ అనే వ్యక్తి వద్ద 5 ఏకే సిరీస్‌ రైఫిళ్లు, తూటాలు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం. అతడికి సరిహద్దు అవతలవైపు ఉగ్రమూకతో సంబంధాలున్నాయి. పీవోకేలోని లష్కరే నాయకులు మంజూర్‌ అహ్మద్‌ షేక్‌, ఖాజీ మహమ్మద్‌ ఖుషాల్‌ల ఆదేశాల మేరకు వీరంతా పనిచేస్తు్న్నారు' అని అధికారులు వెల్లడించారు.

పాక్‌ ఉగ్రవాదులకు సహకారం..
అలాగే రియాజ్‌తోపాటు ఖుర్షీద్‌ అహ్మద్‌, గులాం సర్వార్‌ అనే వ్యక్తులు కూడా పాక్‌లోని ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగానే ఢీల్లీ రైల్వేస్టేషన్‌లో అరెస్టు చేశారు. ఇతడి వద్ద నుంచి మొబైల్‌ ఫోన్‌, సిమ్‌కార్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు. మాస్కోలోని భారత దౌత్య కార్యాలయంలో పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న ఒక వ్యక్తిని ఇటీవలే యూపీలోని మేరఠ్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

#arrested #terrorist #ex-army-officer #riyaz
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe