Telangana: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇకమీదట ప్రతీ ఏడాది జాబ్ కేలండర్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఉద్యోగాల భర్తీ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. వరుసపెట్టి ఉద్యోగులకు నోటిఫికేషన్లు ఇస్తోంది. దాంతో పాటూ మరో గుడ్‌న్యూస్ కూడా చెప్పింది. ఇకమీదట ప్రతీ ఏడాదీ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. By Manogna alamuru 11 Mar 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి Good News For Jobless: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక మీదట ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ళకు ఏళ్ళు ఎదురు చూడనక్కర్లేదని చెప్పింది. ప్రతీ ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. ప్రతీ యేటా టీఎస్‌పీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామకాల బోర్టులు, సంస్థల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెంటర్లు ప్రకటిస్తామని తెలిపింది. దీనికి సంబంధించిన కసరత్తును కూడా ప్రారంభించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రామాణిక రాష్ట్రస్థాయి ముసాయిదా జాబ్ క్యాలెండర్ సిద్ధమవుతోంది. దీన్ని త్వరలోనే ప్రభుత్వానికి పంపిస్తామని పబ్లిక్ సర్వీస్ రమిషన్ తెలిపింది. సర్కార్ అనుమతిస్తే వెంటనే ఈ ఏడాది నుంచే జాబ్ క్యాలెండర్ అమల్లోకి వస్తుందని చెబుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రస్థాయి ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్ క్యాలెండర్ సిద్ధం చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఇలా ఎప్పటికప్పుడు గ్రూప్స్ ఉద్యోగాలతో పాటూ అన్ని విభాగాల్లో ఉద్యోగాలు ప్రకటించడం వలన నిరుద్యోగులు పరీక్షలకు సిద్ధం అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు ప్రభుత్వ ఆధికారులు. ఇక మరోవైపు తెలంగాణలో నిరుద్యోగుల కోసం మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షలు మే/జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ , లాంగ్వేజ్ పండిట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తోపాటు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో పాటూ మరో నోటిపికేషన్‌ను కూడా విడుదల చేసింది తెలంగాణ విద్యాశాఖ. ఈ నోటిఫికేషన్‌లో 6,508 సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT), 2,629 స్కూల్ అసిస్టెంట్లు (SA), 727 లాంగ్వేజ్ పండిట్లు (LP), 182 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PET), 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 220 పోస్టులు, 79 SA క్యాడర్ కింద ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులలో గత బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వం నోటిఫై చేసిన 5,089 ఖాళీలు కూడా ఉన్నాయి. డీఎస్సీ ఎగ్జామ్స్ దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. Also Read:Visakhapatnam: వెలుగులోకి మరో టీవీ సీరియల్ నటి మోసం #telangana #jobs #tspsc #every-year మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి