Yogi Adityanath: రావణుడు..కంసుడి వల్లే కాలేదు..వీరేంత?: యోగి!

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్రంగా స్పందించారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం అనేది ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మనుగడ సాగిస్తుందని పేర్కొన్నారు.

Yogi Adityanath: రావణుడు..కంసుడి వల్లే కాలేదు..వీరేంత?: యోగి!
New Update

Ravana and Kansa failed to erase Sanatan Dharma: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) సనాతన ధర్మం పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే హిందూ సంఘాలన్ని మండిపడుతున్నాయి. అయితే మరికొందరు మాత్రం ఉదయనిధికి సపోర్ట్‌ చేస్తున్నారు.

అయోధ్య సాధువు ఒకరు అయితే ఉదయ్‌ తల నరికి తీసుకుని వస్తే పది కోట్లకు పైగా డబ్బు ఇస్తానని కూడా ప్రకటించారు. మరి కొన్ని చోట్లు కూడా ఉదయ్‌ కి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్రంగా స్పందించారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం అనేది ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మనుగడ సాగిస్తుందని పేర్కొన్నారు.

అప్పుడు..ఇప్పుడు..ఎప్పుడు కూడా సనాతన ధర్మం కూడా అలాగే కొనసాగుతుందని అన్నారు. రావణుడి (Ravana) అహంకారం కూడా ఈ సనాతన ధర్మాన్ని అంతం చేయలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. కంసుడి (Kansa) హూంకారానికీ చలించలేదని అన్నారు. మొఘల్‌ చక్రవర్తలు (Moghals), బాబర్‌ , ఔరంగజేబులు దారుణాలకూ సనాతన ధర్మం అంతరించపోలేదని వివరించారు. అంతటి సనాతన ధర్మం ఇలాంటి అధికారం కోసం పాకులాడే పరాన్నజీవుల వల్ల ఎలా అంతం అవుతుంది? అని అన్నారు.

సూర్యుని పై ఉమ్మి వేయాలనుకుంటే అది మన ముఖం మీదే పడుతుంది. సనాతన ధర్మం అనేది సూర్యుడు వల్లే ప్రకాశవంతమైనదిగా యోగి పేర్కొన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వారిని చరిత్రహీనులుగా గుర్తించాలని పేర్కొన్నారు.

కొద్ది రోజుల క్రితం ఉదయనిది ఓ కవుల సమ్మేళనంలో సనాతన ధర్మం అనేది డెంగ్యూ, మలేరియా వంటిదని దానిని దేశం నుంచి తరిమికొట్టాలని అన్నారు. సనాతన ధర్మం అసమానతలకు మూలం అని, ప్రజలంతా సమానంగా ఉండాలంటే దాన్ని నిర్మూలించాలని పేర్కొన్నారు.

Also Read: ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలపై సుప్రీం జోక్యం చేసుకోవాలి.. సీజేఐకి 262 మంది ప్రముఖుల లేఖ.!!

#yogi-adityanath #udhayanidhi-stalin #yogi #sanatan-dharma #udayanidhi #sanatan-dharma-remark #santana-dharma-row #ravana-and-kansa-failed-to-erase-sanatan-dharma
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe