ఇథియోపియాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మట్టిచరియలు విరిగిపడ్డ సంఘటన తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 257కి చేరింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి మానవతా సాయం వ్యవహారాల విభాగం వెల్లడించింది. ఈ దేశంలో ఆది, సోమావారాల్లో కిన్ చో షాచా గోజ్డీ ప్రాంతంలో ముందుగా మట్టిచరియలు విరిగిపడ్డాయి. ఆ తర్వాత రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో మరోసారి విరిగిపడ్డాయి. ప్రస్తుతం ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య 500 వరకు పెరగొచ్చని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం నుంచి 15 వేల మందికి పైగా బాధితులను ఖాళీ చేయించాల్సిన అవసరం ఉందని.. ఐరాస మానవతా సాయం వ్యవహారాల విభాగం తెలిపింది.
పూర్తిగా చదవండి..Ethiopia: మట్టిచరియలు విరిగిపడిన ఘటన.. 257 మంది మృతి
ఇథియోపియాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మట్టిచరియలు విరిగిపడి ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 257కి చేరింది. ప్రస్తుతం ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. మృతుల సంఖ్య 500 వరకు పెరగొచ్చని స్థానిక అధికారులు చెబుతున్నారు.
Translate this News: