Loksabha:ఎంపీ మహువా మొయిత్రా మీద సస్పెన్షన్ వేటు పడుతుందా?

క్యాష్ ఫర్ క్వరీ ఆరోపణలను ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు ఎథిక్స్ కమిటీ ఇవాళ లోక్ సభలో నివేదిక ప్రవేశ పెట్టనుంది. దీని మీద లోక్ సభ నేడే నిర్ణయం తీసుకోనుంది. ఇది కనుక అమోదం పొందినట్లయితే ఆమె బహిష్కరణకు గురవుతారు.

Loksabha:ఎంపీ మహువా మొయిత్రా మీద సస్పెన్షన్ వేటు పడుతుందా?
New Update

Mahua Moitra: లోక్ సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామిక వేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు తీసుకున్నారని ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ దర్యాప్తులో భాగంగానే మహువా మొయిత్రాతో (Mahua Moitra) పాటు ఆమెపై ఫిర్యాదు చేసిన భాజపా ఎంపీ నిషికాంత్‌ దుబే (Nishikant Dubey), న్యాయవాది జై అనంత్‌ దెహద్రాయ్‌ను కమిటీ విచారించింది. అనంతరం 500 పేజీలతో కూడిన నివేదికను రూపొందించింది. దీనిని ఎథిక్స్ కమిటీ ఆమోదించింది. మహువా సభా దిక్కరణకు పాల్పడ్డారని కమిటీ తెలిపింది. ఆమెను లోక్ సభ నుంచి బహిష్కరించాలని సిఫార్సు చేసింది.

Also Read: ఐదేళ్ళల్లో విదేశాల్లో 403 మంది విద్యార్ధులు మృతి..ఆ దేశంలోనే ఎక్కువ

ఎథిక్స్ కమిటీ (Ethics Panel) నివేదికను విజయ్ సోన్కర్ ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీంతో ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్ సభలో నినాదాలు చేశారు. నివేదిక మీద ఓటింగ్ నిర్వహించడానికి ముందు తమకు ఒక కాపీ ఇవ్వాలని పట్టుబట్టారు. స్పీకర్ వారించినా విపక్షాలు వినలేదు. దీంతో సబ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఒకవేళ కనుక సభ నివేదికను ఆమోదించితే కనుక మహువా మొయిత్రా లోక్ సభ నుంచి బహిష్కరణకు గురవుతారు. దీనిపై సభ ఈరోజే నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

ఇక సభ సమావేశాలకు ముందు మహువా మీడియాతో మాట్లాడారు. దుర్గా మాత వచ్చింది. ఇక మీదట చూసుకుందాం. వినాశనం సంభవించినప్పుడు.. మొదట కనుమరుగయ్యేది తెలివే అని మహువా అన్నారు.  వస్త్రాపహరణాన్ని వాళ్ళు మొదలుపెట్టారు. ఇక మహాభారత యుద్ధాన్ని చూస్తారు అంటూ బీజేపీ ప్రభుత్వం మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read: కేసీఆర్ కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ..పర్యవేక్షిస్తున్న కొత్త సీఎం రేవంత్ టీమ్.

#loksabha #mahua-moitra #suspenssion #etics-panel #tmc
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe