ESIC Recruitment 2023: న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (Employees' State Insurance Corporation) ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాలు లేదా ఆసుపత్రుల్లో 1038 పారమెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రీజియన్ లో మొత్తం 70 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అర్హతతోపాటు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీల్లో ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
కేటగిరీ వారిగా పోస్టుల వివరాలు :
-ఈసీజీ టెక్నీషియన్
- జూనియర్ రేడియోగ్రాఫర్,
-జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్,
-మెడికల్ రికార్డు అసిస్టెంట్,
-ఓటీ అసిస్టెంట్,
-ఫార్మసిస్ట్ రేడియో గ్రాఫర్,
-సోషల్ గైడ్,
- సోషల్ వర్కర్
ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో 670 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నిరుద్యోగులకు మంత్రి శుభవార్త
రీజియన్లవారీగా ESIC లో ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే
-బిహార్: 64
- చండీగఢ్, పంజాబ్: 32
-ఛత్తీస్‌గఢ్: 23
- ఢిల్లీ ఎన్‌సీఆర్: 27
-గుజరాత్: 72
-హిమాచల్ ప్రదేశ్: 06
-జమ్ము అండ్ కశ్మీర్: 09
- ఝార్ఖండ్: 17
-కర్ణాటక: 57
-కేరళ: 12
-మధ్యప్రదేశ్: 13
-మహారాష్ట్ర: 71
- నార్త్ ఈస్ట్: 13
- ఒడిశా: 28
- రాజస్థాన్: 125
-తమిళనాడు: 56
- తెలంగాణ: 70
- ఉత్తర్ ప్రదేశ్: 44
- ఉత్తరాఖండ్: 09
-పశ్చిమ్ బెంగాల్: 42
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, సర్టిఫికేట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, టైపింగ్/ డేటా ఎంట్రీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలక్ట్ చేస్తారు.
రాత పరీక్ష విధానం:
మొత్తం 100 ప్రశ్నలకుగాను 150 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో టెక్నికల్/ ప్రొఫెషనల్ నాలెడ్జ్-50 ప్రశ్నలు-100 మార్కులు, జనరల్ అవేర్‌నెస్-10 ప్రశ్నలు-10 మార్కులు, జనరల్ఇంటెలిజెన్స్-20 ప్రశ్నలు- 20 మార్కులు, అరిథ్‌మెటిక్ ఎబిలిటీ-20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. సమయం 120 నిమిషాలు.
ముఖ్యమైన తేదీలు...
-ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.10.2023.
-ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.10.2023.