Bigg Boss Telugu 8: 'దేకో దేకో బిగ్ బాస్ మస్త్ ఆట'.. కలర్ ఫుల్ గా బిగ్ బాస్ ప్రోమో

వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సరికొత్త సీజన్ తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతోంది. తాజాగా మేకర్స్ సీజన్ 8 ప్రోమోను రిలీజ్ చేశారు. కమెడియన్ సత్య డైలాగ్స్, బిగ్ బాస్.. బిగ్ బాస్ అంటూ సాగే పాటతో కలర్ ఫుల్ ప్రోమో ప్రేక్షకులను అలరిస్తోంది.

Bigg Boss Telugu 8: 'దేకో దేకో బిగ్ బాస్ మస్త్ ఆట'.. కలర్ ఫుల్ గా బిగ్ బాస్ ప్రోమో
New Update

Bigg Boss Telugu 8: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 'ఇక్కడ ఒక్కసారి కమిటైతే లిమిటే లేదు.. లిమిట్ లెస్ ఫన్, డ్రామా, ఎంటర్ టైన్మెంట్ అంటూ ఇప్పటికే విడుదలైన సీజన్ 8 టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచగా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.

సీజన్ 8 ప్రోమో

ఈ ప్రోమోను నాగార్జున, కమెడియన్ సత్య దేవ్ డైలాగ్స్, కొంత మంది అమ్మాయిల నృత్య ప్రదర్శనలు, పాటలతో ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఎంటర్ టైన్మెంట్, ట్విస్ట్స్, టర్న్స్, ఫన్, కు లిమిటే లేదు అనే కాన్సెప్ట్ తో విడుదలైన ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రోమోలో 'దేకో దేకో బిగ్ బాస్ మస్త్ ఆట' అంటూ సాగే బిగ్ బాస్ జింగిల్ షో పై ఆసక్తిని పెంచుతోంది.

ఇక సీజన్ 8 కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. ఊహించని వ్యక్తులు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పలువురి పేర్లు వైరలవుతున్నాయి. సీరియల్ నటి తేజశ్విని, ఏక్ నాథ్- హారిక కపుల్, బర్రెలక్క, కుమారి ఆంటీ, విష్ణు ప్రియా, రీతూ చౌదరీ, వేణు స్వామీ, కిర్రాక్ ఆర్ఫీ , అంజలి పవన్, నిఖిల్, శ్వేతా నాయుడు , రాజ్ తరుణ్ సీజన్ 8 లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: Kanguva: అదిరిపోయే విజువల్స్, యాక్షన్ సీన్స్.. సూర్య కంగువా ట్రైలర్..! - Rtvlive.com

#bigg-boss-8-promo #akkineni-nagarjuna
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe