Victory Venkatesh: వెంకటేష్ 38 ఏళ్ళ సినీ ప్రయాణం..! వీడియో వైరల్

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ #SVC58. తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. చిత్ర పరిశ్రమలో వెంకటేష్ 38 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్టింగ్ తో సెలెబ్రేట్ చేశారు. ఈ వీడియోను xలో షేర్ చేశారు.

New Update
Victory Venkatesh: వెంకటేష్ 38 ఏళ్ళ సినీ ప్రయాణం..! వీడియో వైరల్

Victory Venkatesh:  ఎఫ్2, ఎఫ్3 బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత విక్టరీ వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. #SVC58 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేసిన ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది. ఇటీవలే హీరో వీకెంకటేష్ కూడా సెట్స్ లో జాయిన్ అయినట్లు వీడియోను షేర్ చేశారు మేకర్స్.

వెంకటేష్ 38 ఏళ్ళ సినీ ప్రయాణం

అయితే తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి మరో స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. హీరో విక్టరీ వెంకటేష్ ఇండస్ట్రీలో 38 ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా.. దర్శకుడు అనిల్ రావిపూడి కేక్ కట్టింగ్ తో సెలెబ్రేట్ చేశారు. ఈ సెలెబ్రేషన్స్ లో SVC58 చిత్రబృందం అంతా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మేకర్స్ తమ ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేశారు. అలాగే ప్రస్తుతం #SVC58 షూటింగ్ పొల్లాచ్చిలో కొనసాగుతున్నట్లు.. ఈ షెడ్యూల్ లో సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఫీమేల్ లీడ్స్ గా నటించగా.. ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కాబ్రా, చిట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: Venkatesh : బ్యాక్ టూ యాక్షన్.. అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన వెంకీ మామ, వీడియో వైరల్! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు