Odela 2: బోనం ఎత్తిన తమన్నా.. ఓదెల 2 కొత్త పోస్టర్..!

అశోక్‌ తేజ దర్శకత్వంలో ఓదెల సీక్వెల్ గా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ఓదెల 2. తాజాగా మూవీ నుంచి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. బోనాల సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తమన్నా పోస్టర్ షేర్ చేశారు. ఇందులో తమన్నా బోనం ఎత్తుకొని కనిపించింది.

New Update
Odela 2: బోనం ఎత్తిన తమన్నా.. ఓదెల 2 కొత్త పోస్టర్..!

Odela 2: అశోక్ తేజ దర్శకత్వంలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఓదెల. ఓదెల అనే ప్రాంతంలో జరిగిన జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా 2022 లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ఓదెల 2 తెరకెక్కుతోంది. 'ఓదెల 2' లో టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా, వశిష్ట ఎన్. సింహా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో తమన్నా శివ‌శ‌క్తి అనే పాత్ర‌లో శివుడికి పరామభక్తురాలిగా కనిపించనుంది.

తమన్నా పోస్టర్

అయితే తాజాగా మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తమన్నా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో తమన్నా బోనం ఎత్తుకొని అచ్చ తెలుగమ్మాయిలా కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన మల్లన్న గుడి సెట్‌లో చిత్రీకరిస్తున్నట్లు తెలిపింది చిత్రబృందం.

Also Read: Tripti Dimri : యనిమల్ పార్క్ సినిమా డేట్ ఫిక్స్.. రిలీజ్ అప్పుడే.. నేషనల్ క్రష్ కామెంట్స్! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు