/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-18T173426.717.jpg)
Murari Re- Release: ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన తమ పేవరెట్ హీరోల చిత్రాలను మరోసారి థియేటర్స్ లో చూసేందుకు ఇష్టపడవుతున్నారు ఫ్యాన్స్. రీ రిలీజ్ అనే కాన్సెప్ట్ తో ఇప్పటికే విడుదలైన పలు సూపర్ హిట్ సినిమాలు రెండో సారి కూడా అదే క్రేజ్ తో బాక్సాఫీస్ ముందు సత్తా చూపించాయి.
మురారి రీ రిలీజ్
అయితే తాజాగా మరో స్టార్ హీరో సినిమా రీ రిలీజ్ కు సిద్దమైనట్లు తెలుస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, సోనాలి బింద్రే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'మురారి' చిత్రం మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్‌లలో ఒకటిగా నిలిచిన ఈ చిత్రాన్ని ఆగష్టు 09న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నట్లు నెట్టింట న్యూస్ వైరలవుతోంది. దీని పై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఇలా ఉంటే కొంతమంది ఫ్యాన్స్ ఏకంగా వెడ్డింగ్ కార్డులతో రీ రిలీజ్ పోస్టర్లను షేర్ చేస్తున్నారు. మురారి, వసుంధర పెళ్ళికి సినిమా అభిమానులందరు ఆహ్వానితులే అంటూ శుభలేఖను షేర్ చేస్తున్నారు. అంతేకాదు ఈ పోస్టులకు దర్శకుడు కృష్ణవంశీని ట్యాగ్ చేసి.. సర్ వీలైతే రీ రిలీజ్ ప్లాన్ చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Veetini chudandi Sir @director_kv 😊😊
My fav and Nostalgic movie #Murari re-release on Aug 9 on the eve of @urstrulyMahesh Babu B'day 😊@iamsonalibendre#Murari4K#MurariReRelease#MurariMarosaari#MurariMarosaripic.twitter.com/id5FKIsTrf
— Karthik (@withluv_karthik) July 18, 2024
తెలుగు సినిమా అభిమానులందరికి ఆహ్వానం ♥️
పెద్దలందరూ విచ్చేసి మా ఈ మురారి వసుంధర ను దీవించవలిసిందిగా కోరుచున్నాము....🙏🏻
అందరు ఆహ్వానితులే....♥️@director_kv gaaru meere chief guest pelliki tappakunda raavali Mari 😍#MurariMarosari#Murari4K#SSMB29@urstrulyMahesh@SSMBSpacepic.twitter.com/paHyYVctre— TATIPAKA MBFC (@TATIPAKA_MBFC) July 18, 2024