World of Vasudev: 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్'... కిరణ్ అబ్బవరం ఫస్ట్ సింగిల్

కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'క'. పీరియాడిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుజిత్‌-సందీప్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్' లిరికల్ వీడియో విడుదలైంది. సినిమాలో హీరో ప్రపంచం ఎలా ఉంటుంది? అనే నేపథ్యంలో ఈ పాట సాగింది.

New Update
World of Vasudev:  'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్'... కిరణ్ అబ్బవరం ఫస్ట్ సింగిల్

World of Vasudev: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుజిత్‌-సందీప్‌ దర్శకత్వంలో పీరియాడిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ప్రాజెక్ట్ 'క' (KA) చేస్తున్నారు. 1970 ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగే కథగా ఈ చిత్రం ఉండబోతుంది. వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో తాన్వి, నయన్ సారిక ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు.

వరల్డ్ ఆఫ్ వాసుదేవ్

తాజాగా మేకర్స్ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ రిలీజ్ చేశారు. ఏ మొదలు తుదలు లేని ప్రయాణం.. అంటూ సాగిన ఈ పాట సినిమాలో హీరో ప్రపంచం ఎలా ఉంటుందో తెలిపేలా ఉంది. పాటలో పల్లెటూరులో పోస్టర్ మ్యాన్ గా కిరణ్ అబ్బవరం, హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ విజువల్స్ చాలా అందంగా కనిపించాయి. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్‌ మ్యూజిక్ అందించగా.. సనాపతి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ రాశారు. కపిల్ కపిలన్ ఈ పాటను ఆలపించారు.

Also Read: Kiara Advani: ఎన్టీఆర్ జోడిగా రాంచరణ్ హీరోయిన్..? వార్ 2 అప్డేట్ వైరల్ - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు