Vishwak Sen: 'VS13' నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసిన విశ్వక్.. పోస్టర్ వైరల్

టాలీవుడ్ మాస కా దాస్ విశ్వక్ సేన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. VS13 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శ్రీధర్ గంటా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో విశ్వక్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

New Update
Vishwak Sen: 'VS13' నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసిన విశ్వక్.. పోస్టర్ వైరల్

Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విశ్వక్ రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకీ (Mechanic Rocky) సినిమాలో నటిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో విశ్వక్ సరసం మీనాక్షి చౌదరీ, శ్రద్దాశ్రీనాథ్‌ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు.

VS13 విశ్వక్ నెక్స్ట్ మూవీ

ఇది ఇలా ఉంటే తాజాగా విశ్వక్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. VS13 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి శ్రీధర్ గంటా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్ ఖాకీ డ్రెస్, జేబులో పిస్తోల్ తో కనిపించాడు. పోస్టర్ లో పోలీస్ ఆఫీసర్ కనిపిస్తున్న విశ్వక్ లుక్ సినిమా పై ఆసక్తిని పెంచుతోంది. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు.

Also Read: Gaddar Death Anniversary : గద్దరన్న యాదిలో.. పాటలతో అభిమానుల ఘన నివాళి! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు