Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం కొత్త మూవీ.. టైటిల్ అదే..?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బ‌వ‌రం తన నెక్స్ట్ కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రానికి సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ జూలై 09న రివీల్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం కొత్త మూవీ.. టైటిల్ అదే..?

Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్ రూల్స్ రంజాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతేడాది అక్టోబర్ లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. తాజాగా తన కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు.

కిరణ్ అబ్బవరం కొత్త ప్రాజెక్ట్

పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రానికి సుజీత్, సందీప్ ఇద్దరు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ చక్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై గోపాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ జులై 9న చేయబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్ లో అభినవ్ వాసుదేవ్ అనే వ్యక్తి క్రిష్ణగిరి సబ్ ఇన్స్పెక్టర్ దీపాల ప‌ద్మ‌నాభం గారికి వ్రాయున‌ది అంటూ ఒక ఉత్తరం కనిపిస్తుంది. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో కిరణ్ ఒక పోలీస్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

రహస్య గోరక్ తో వివాహం 

ఇక కిరణ్ అబ్బవరం వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అతను నటించిన మొదటి సినిమా ‘రాజావారు రాణిగారు’ హీరోయిన్ రహస్య గోరక్‌ ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది మార్చ్ 13న వీరి ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.

publive-image

Also Read: Salman Khan: "హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ సాహబ్".. సల్మాన్ ఖాన్ స్పెషల్ విషెష్ - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు