Krishna Vamsi: కృష వంశీ బర్త్ డే స్పెషల్.. మొదటి చిత్రంతోనే నంది అవార్డు..! మొదటి చిత్రానికే నంది అవార్డు వరించిన వైవిధ్య దర్శకుడు కృష వంశీ పుట్టినరోజు నేడు. చిత్రసీమలో అడుగుపెట్టిన కొద్ది రోజులకే తన సినిమాలతో అందరి మన్ననలు అందుకున్నారు. నేడు ఆయన బర్త్ డే సంబర్భంగా మరో సారి ఆయన సినీ కెరీర్ ను గుర్తుచేసుకుందాము. By Archana 28 Jul 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Krishna Vamsi: మొదటి చిత్రానికే నంది అవార్డు వరించిన వైవిధ్య దర్శకుడు కృష వంశీ పుట్టినరోజు నేడు. తన ప్రతీ చిత్రంలోనూ వైవిధ్యం ప్రదర్శించాలనే భావిస్తారు. గులాబీ, ఖడ్గం, సింధూరం,చక్రం, చందమామ వంటి సినిమాలతో ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు కృషవంశీ. నేడు ఆయన పుట్టిరోజు సంబర్భంగా మరో సారి ఆయన సినీ కెరీర్ ను గుర్తుచేసుకుందాము. కృష్ణ వంశీ సినీ కెరీర్ దర్శకుడు కృష్ణ వంశీ పూర్తి పేరు పసుపులేటి వెంకట బంగార్రాజు. వృత్తి పరంగా ఆయనను కృష్ణ వంశీ అని పిలుస్తారు. రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టిన కృష్ణ తనదైన శైలి సినిమాలతో ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1995 లో క్రైమ్ థ్రిల్లర్ గులాబీ సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టారు. అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. 3 జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, తొమ్మిది నంది అవార్డులను తెచ్చిపెట్టింది ఈ చిత్రం. 1996లో నిన్నే పెళ్లాడతా సినిమా నాగార్జున సినీ రికార్డులను తిరగరాసింది. ఒక్కసారిగా చిత్రసీమ కృష్ణవంశీవైపు తిరిగి చూసేలా చేసింది. నంది అవార్డు చిత్రాలు ఆ తర్వాత గులాబీ, ఖడ్గం, సింధూరం,చక్రం, చందమామ వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఉత్తమ దర్శకుడిగా మరెన్నో నంది అవార్డులు, ఫిల్మ్ ఫెయిర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. యాక్షన్, థ్రిల్లర్, ఫ్యామిలీ ఇలా ప్రతీ జోనర్ సినిమాలతో సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. కృష్ణ వంశీ కల్ట్ క్లాసిక్ 'అంతఃపురం' చిత్రాన్ని ఇప్పటికీ అభిమానిస్తారు ప్రేక్షకులు. సిరివెన్నెల సీతారామశాస్త్రి వీరాభిమానిగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ లెజండ్రీ గేయ రచయిత సిరి వెన్నెల సీతారామశాస్త్రికి వీరాభిమాని. కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన నిన్నే పెళ్లాడతా, గులాబీ, సింధూరం, చంద్రలేఖ, మురారి, ఖడ్గం, చక్రం, మహాత్మ, పైసా వంటి అనేక చిత్రాలకు సిరి వెన్నెల సీతారామశాస్త్రికి సాహిత్యం అందించారు. సీతారామశాస్త్రి కృష్ణ వంశీని హిందూ సాంప్రదాయ పద్ధతిలో దత్తత తీసుకున్నారు. కృష్ణ వంశీ లేటెస్ట్ ఫిల్మ్స్ కృష్ణవంశీ గతేడాది ‘రంగమార్తాండ’తో సినిమాతో ప్రేక్షకులను అలరించారు. దీని తర్వాత ‘అన్నం’ అనే సినిమానూ ఆయన తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. Also Read: Chinmayi: పిల్లాడికి లిప్ కిస్ ఇస్తావా? నీకు సిగ్గుందా? అనసూయకు ఇచ్చిపడేసిన చిన్మయి - Rtvlive.com #krishna-vamsi #director-krishna-vamsi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి