This Week Movies: ఈ వారం థియేటర్స్ లో అదిరిపోయే సినిమాలు..! వివరాలివే

ఈ వారం పలు ఆసక్తికర సినిమాలు థియేటర్స్ లో సందడి చేసేందుకు వస్తున్నాయి. అల్లు శిరీష్‌- బడ్డీ, అశ్విన్‌బాబు- శివమ్ భజే, జాన్వీకపూర్‌- ఉలఝ్‌, రాజ్‌తరుణ్- తిరగబడరసామీ, విజయ్ ఆంటోనీ- తుఫాన్ చిత్రాలు విడుదల కాబోతున్నాయి.

This Week Movies: ఈ వారం థియేటర్స్ లో అదిరిపోయే సినిమాలు..! వివరాలివే
New Update

This Week Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో పలు చిన్న, పెద్ద సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు, విడుదల తేదికి సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.. 

ఉలఝ్‌

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్- గుల్షన్‌ దేవయ్య జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఉలఝ్‌'. ఈ చిత్రంలో జాన్వీ IFS అధికారిగా కనిపించబోతుంది. IFS ఆఫీసర్ కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి సుధాన్షు సరియా దర్శకత్వం వహించారు. స్పై థ్రిల్లర్ గా అలరించబోతున్న ఈ మూవీ ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

శివమ్ భజే

ఓంకార్ బ్రదర్ అశ్విన్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ శివమ్ భజే. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై అఫ్సర్‌ దర్శకత్వం వహించారు. యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపిండిన ఈ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది.

బడ్డీ

అల్లు శిరీష్- గాయత్రి భరద్వాజ్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'బడ్డీ'. న్యూ ఏజ్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టూడియో గ్రీన్‌ ఫిలింస్‌ బ్యానర్ పై జ్ఞానవేల్‌ రాజా, అధన జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ సినిమాకు శామ్‌ ఆంటోన్‌ దర్శకత్వం వహించారు.

తుఫాన్

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తుఫాన్. విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యరాజ్‌, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘తిరగబడరసామీ'

రాజ్ తరుణ్- మాల్వీ మల్హోత్రా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తిరగబడరసామీ'. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మన్నారా చోప్రా, మకరంద్‌ దేశ్‌పాండే, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆగస్టు 2 న విడుదల కానుంది.

ఉషా పరిణయం

దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ఆయన కుమారుడు శ్రీకమల్‌ హీరోగా పరిచయమవుతున్న లేటెస్ట్ మూవీ ‘ఉషా పరిణయం’. సరికొత్త ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలనాటి రామచంద్రుడు

చిలుకూరి ఆకాష్‌రెడ్డి దర్శకత్వంలో కృష్ణవంశీ, మోక్ష జంటగా నటించిన చిత్రం 'అలనాటి రామచంద్రుడు'. ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీ రిలీజ్

మోడ్రన్ మాస్టర్స్

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినీ జీవితం ఆధారంగా రూపొందుతున్న డాక్యుమెంటరీ ఫిల్మ్ మోడ్రన్ మాస్టర్స్. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రూపొందించింది. రాజమౌళి మోడ్రన్ మాస్టర్స్ ఆగస్టు 2న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

నో వే అవుట్ కొరియన్‌: డిస్నీ+హాట్‌స్టార్‌, జులై 31

బృంద: సోనీ లివ్‌, ఆగస్టు 2

డ్యూన్‌ 2 : జియో సినిమా, ఆగస్టు 1

ఘుడ్‌ చడీ: జియో సినిమా, ఆగస్టు 1

Also Read: Triptii Dimri: యనిమల్ పార్క్ సినిమా డేట్ ఫిక్స్.. రిలీజ్ అప్పుడే.. నేషనల్ క్రష్ కామెంట్స్! - Rtvlive.com

#this-week-movies
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe