This Week Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో పలు చిన్న, పెద్ద సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు, విడుదల తేదికి సంబంధించిన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..ఉలఝ్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్- గుల్షన్ దేవయ్య జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉలఝ్’. ఈ చిత్రంలో జాన్వీ IFS అధికారిగా కనిపించబోతుంది. IFS ఆఫీసర్ కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి సుధాన్షు సరియా దర్శకత్వం వహించారు. స్పై థ్రిల్లర్ గా అలరించబోతున్న ఈ మూవీ ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
శివమ్ భజే
ఓంకార్ బ్రదర్ అశ్విన్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ శివమ్ భజే. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అఫ్సర్ దర్శకత్వం వహించారు. యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపిండిన ఈ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది.
బడ్డీ
అల్లు శిరీష్- గాయత్రి భరద్వాజ్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బడ్డీ’. న్యూ ఏజ్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమాకు శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు.
తుఫాన్
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తుఫాన్. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యరాజ్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘తిరగబడరసామీ’
రాజ్ తరుణ్- మాల్వీ మల్హోత్రా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తిరగబడరసామీ’. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆగస్టు 2 న విడుదల కానుంది.
ఉషా పరిణయం
దర్శకుడు విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ఆయన కుమారుడు శ్రీకమల్ హీరోగా పరిచయమవుతున్న లేటెస్ట్ మూవీ ‘ఉషా పరిణయం’. సరికొత్త ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలనాటి రామచంద్రుడు
చిలుకూరి ఆకాష్‌రెడ్డి దర్శకత్వంలో కృష్ణవంశీ, మోక్ష జంటగా నటించిన చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీ రిలీజ్
మోడ్రన్ మాస్టర్స్
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినీ జీవితం ఆధారంగా రూపొందుతున్న డాక్యుమెంటరీ ఫిల్మ్ మోడ్రన్ మాస్టర్స్. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రూపొందించింది. రాజమౌళి మోడ్రన్ మాస్టర్స్ ఆగస్టు 2న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
నో వే అవుట్ కొరియన్: డిస్నీ+హాట్‌స్టార్, జులై 31
బృంద: సోనీ లివ్, ఆగస్టు 2
డ్యూన్ 2 : జియో సినిమా, ఆగస్టు 1
ఘుడ్ చడీ: జియో సినిమా, ఆగస్టు 1
[vuukle]