Suhana Khan: షారుక్ కుమార్తెతో అమితాబ్ మనవడు డేటింగ్.. వీడియో వైరల్..! షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వీరిద్దరూ లండన్లోని ఓ నైట్ క్లబ్లో పార్టీ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. By Archana 28 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Suhana Khan: బాలీవుడ్ కింగ్ షారుక్ (Shah Rukh) కుమార్తె సుహానా ఖాన్ ఇటీవలే ‘ది ఆర్చీస్’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సుహానా ఖాన్ ‘కింగ్’ మూవీతో (King Movie) వెండి తెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రానికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించగా... రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, సిద్ధార్థ్ ఆనంద్ మార్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు సమాచారం. దీని పై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. సుహానా ఖాన్, గస్త్య నందా డేటింగ్ ఇది ఇలా ఉంటే తాజాగా షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే గత కొద్దిరోజులుగా షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా (Agastya Nanda) డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ వారిద్దరూ ఈ ఊహాగానాల పై వ్యాఖ్యానించలేదు. లండన్లోని నైట్ క్లబ్లో కాగా, తాజాగా లండన్లోని ఓ నైట్ క్లబ్లో సుహానా ఖాన్, అగస్త్య నందా పార్టీ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. 'ది ఆర్చీస్' చిత్రంలో కలిసి పనిచేసిన వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు నైట్ క్లబ్లో వీరిద్దరి వీడియో వైరల్ కావడంతో చర్చకు మరింత ఆజ్యం పోసింది. అయితే సుహానా ఖాన్ ఒక సినిమా షూటింగ్ కోసం లండన్ వెళ్లినట్లు సమాచారం. అదే సమయంలో ఆమె ఫ్రెండ్ వేదాంత్ మహాజన్ పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీలో నైసా దేవగన్ ఉన్నట్లు సమాచారం. So apparently Khans fam is still in London. Suhana from last night #SuhanaKhan pic.twitter.com/eyDcEBPdQ1 — •Just• | viciouslady (@jviciouslady) June 27, 2024 గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. Also Read: Kalki 2898 AD: ‘కల్కి’కి జాక్ పాట్.. ఓటీటీ రైట్స్ కోసం రెండు దిగ్గజ ప్లాట్ ఫార్మ్స్ బరిలో …! #amitab-bacchan #suhana-khan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి