Brinda Release: స్టార్ హీరోయిన్ త్రిష ఓటీటీ ఎంట్రీ.. 'బృందా' గా ప్రేక్షకుల ముందుకు స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సీరీస్ 'బృందా'. ఈ సీరీస్ కు సూర్య వంగల దర్శకత్వం వహించారు. తాజాగా 'బృందా' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోని లివ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. By Archana 12 Jul 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Brinda Release: ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న తమిళ స్టార్ హీరోయిన్ త్రిష సరి కొత్త వెబ్ సీరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతుంది. త్రిష నటించిన ఈ తొలి వెబ్ సీరీస్ పేరు ‘బృందా’. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో రూపొందిన ఈ సీరీస్ కు సూర్య వంగల దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన 'బృందా' ట్రైలర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా సీరీస్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సోని లివ్ లో బృందా స్ట్రీమింగ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీ లివ్ వేదికగా ఆగస్టు 2 నుంచి 'బృందా' స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సీరీస్ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. త్రిష ఫీమేల్ లీడ్ గా నటించిన ఈ సీరీస్ లో ఇంద్రజిత్ సుకుమారన్, ఆమని, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే.. ఈ అమ్మడు ప్రస్తుతం 4 సినిమాలతో బిజీగా ఉంది. మెగాస్టార్ సరసన విశ్వంభర, కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, మోహన్‌లాల్ ‘రామ్’, అజిత్ ‘విదా ముయార్చి’, చిత్రాలు చేస్తోంది. Brace yourselves, thriller fans. Trisha is coming up with her OTT debut in a gripping new series. Stream #Brinda in all the major languages only on Sony LIV from August 2. @trishtrashers @Indrajith_S @suryavangala530 @andstoriesllp @KollaAshish @shakthikanth @artkolla pic.twitter.com/AqyykY1z9a — Sony LIV (@SonyLIV) July 8, 2024 Also Read: Ambani Wedding: కళ్ళు జిగేలుమనిపించేలా అంబానీ పెళ్లి ఊరేగింపు.. వీడియో వైరల్ - Rtvlive.com #brinda-release-date #brinda-series #actress-trisha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి