/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-12T174959.986.jpg)
Ambani Wedding: రిలయన్స్ అధినేత బిలినీయర్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి సంబరాలు అంబరానంటుతున్నాయి. నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు దేశంలోని అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రపంచ తారలు, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
ఘనంగా ముగిసిన ప్రీ వెడ్డింగ్ వేడుకల తర్వాత ఈరోజు అనంత్ అంబానీ- రాధికా మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. అపర కుబేరుడైన అంబానీ కుమారుడి వివాహ మహోత్సవానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు, వ్యాపార వేత్తలు, దేశాధినేతలు, హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ తారలు హాజరవుతున్నారు.
విలాసవంతమైన కారులో వివాహ వేదికకు చేరుకున్న అనంత్ అంబానీ
మరి కొంత సమయంలో వివాహం జరగనున్న నేపథ్యంలో అంబానీ కుటుంబం ముంబై లోని తమ నివాసమైన యాంటిలియా నుంచి BKCలోని Jio వరల్డ్‌లోని వివాహ వేదిక బయలుదేరారు. భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ వివాహ ఊరేగింపు రాజరిక వాతావరణాన్ని సృష్టించింది. విలాసవంతమైన కారులో వివాహ వేదికను చేరుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
View this post on Instagram
Also Read: Ambani Wedding Cost: 5000,00,00,000.. వామ్మో..ఇన్ని వేల కోట్లతో పెళ్లా..! - Rtvlive.com