/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-15T155458.525.jpg)
Amaran Making Video: కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'అమరన్'. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్, అశోక చక్ర గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి మేజర్ ముకుంద్ భార్య ఇంధు రెబెక్కా వర్గీస్ పాత్రలో నటించగా.. రాహుల్ బోస్ కమాండింగ్ ఆఫీసర్ పాత్రను పోషించారు. ఇప్పటికే కశ్మీర్‌లో 75 రోజులపాటు లాంగ్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అమరన్ మేకింగ్ వీడియో
ఈ నేపథ్యంలో నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమర జవాన్ల త్యాగాలను స్మరిస్తూ.. మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో షూట్ చేసిన సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఉత్కంఠభరితమైన విజువల్స్, నటీనటుల పర్ఫామెన్స్ సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి. కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.
We stand free because they stand strong, salute to our soldiers!#HappyIndependenceDay wishes from #Amaranhttps://t.co/AWu82H0a3U#AmaranDiwali#AmaranOctober31#Ulaganayagan #KamalHaasan #Sivakarthikeyan #SaiPallavi #RajkumarPeriasamy@ikamalhaasan @Siva_Kartikeyan… pic.twitter.com/gk9W4NbWPT
— Raaj Kamal Films International (@RKFI) August 15, 2024
Also Read: Mr Bachchan: 'మిస్టర్ బచ్చన్' లో సిద్దూ, దేవిశ్రీ ప్రసాద్.. అదిరిపోయిన ఎంట్రీ! - Rtvlive.com