Actor Siddique: మలయాళ సీనియర్ నటుడు సిద్ధిఖీ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవలే నటి రేవతి సంపత్ ఆయన పై చేసిన లైంగిక ఆరోపణలు మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర దూమారం రేపుతున్నాయి. సిద్ధిఖీ తనను రేప్ చేశాడని, తనతో పాటు తన స్నేహితులను కూడా లైగికంగా వేధించాడంటూ రేవతి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
నటుడు సిద్ధిఖీ రాజీనామా
ఈ ఆరోపణల నేపథ్యంలో నటుడు సిద్ధిఖీ తన జనరల్ సెక్రెటరీ పదవికి రాజీనామా చేశాడు. తన పై వచ్చిన ఆరోపణల కారణంగానే పదవి విరమణ చేస్తున్నాని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను పదవిలో కొనసాగడం సరికాదని. తన పై వచ్చిన ఆరోపణలపై న్యాయ సలహా తీసుకున్న తర్వాతే స్పందిస్తానని ధృవీకరించారు. నటుడు సిద్ధిఖీ ఆదివారం తన రాజీనామా లేఖను ప్రెసిడెంట్ మోహన్ లాల్‌కు అందజేశారు.
ఇది ఇలా ఉంటే మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమా కమిటీ ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కు ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ శుక్రవారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో జనరల్ సెక్రటరీ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో మహిళా వేధింపులను సహించేది లేదు. వారికి అండగా అసోషియేషన్ ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత రోజే సిద్ధిఖీ పై లైంగిక ఆరోపణలు రావడం గమనించాల్సిన విషయం. అయితే కొంత మంది నెటిజన్లు నటి రేవతి కేవలం అటెన్షన్, కోసమే ఈ ఆరోపణలు చేసింది అనగా.. మరికొంతమంది తన ఆరోపణల్లో నిజం కూడా ఉండవచ్చు అని అంటున్నారు.