Ruhani Sharma: 'సిగ్గుమాలిన చర్య..' బోల్డ్ సీన్స్ వైరల్ చేయడంపై రుహాణి శర్మ సంచలన కామెంట్స్! రుహానీ శర్మ 'ఆగ్రా' సినిమాలో ఆమె నటించిన బోల్డ్ సీన్స్ ను వైరల్ చేయడం పై ఆవేదన వ్యక్తం చేసింది. "సినిమాలో తమ కష్టాన్ని, అంకితభావాన్ని కాకుండా కేవలం కొన్ని సీన్స్ వైరల్ చేయడం సిగ్గుమాలిన చర్య. సినిమా గొప్పతనాన్ని మాత్రమే చూడండి అంటూ xలో పోస్ట్ పెట్టింది." By Archana 24 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Ruhani Sharma: టాలీవుడ్ నటి రుహనీ శర్మ నటించిన అవార్డు విన్నింగ్ ఫిల్మ్ 'ఆగ్రా'. గతేడాది విడుదలైన ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమవడంతో పాటు అనేక అవార్డులను గెలుచుకుంది. అయితే పలు అంశాల కారణంగా ఇండియాలో ఈ చిత్రాన్ని ఓటీటీ విడుదల చేసేందుకు అనుమతించలేదు. అయినప్పటికీ కొన్ని పైరసీ వెబ్‌సైట్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు ఈ సినిమాలోని కథను చూడకుండా కేవలం రుహనీ శర్మ నటించిన బోల్డ్ సీన్స్ ను మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. రుహనీ శర్మ పోస్ట్ తాజాగా ఈ ఘటన పై నటి రుహనీ శర్మ స్పందిస్తూ ఎక్స్ వేదికగా ఎమోషనల్ నోట్ విడుదల చేసింది. "అందరికీ నమస్కారం.. నేను నటించిన 'ఆగ్రా' సినిమాలోని సీన్స్ ను వైరల్ చేయడం నాకు ఎంతో బాధను కలిగించింది. నా భాదను వివరించడానికి నిరుత్సాహం కూడా చిన్నమాట. సినిమాలో మా కష్టాన్ని, పని పై పట్ల ఉన్న అంకితభావాన్ని కాకుండా కొన్ని సన్నివేశాలను మాత్రమే వైరల్ చేయడం అనేది సిగ్గుమాలిన చర్య. ఒక కళత్మకమైన చిత్రాన్ని రూపొందించడం అనేది ఎన్నో సవాళ్లతో పాటు నిద్రలేని రాత్రులతో కూడిన పని. అలాంటి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే చెమటను రక్తంగా మార్చాలి. అలాంటి మా కష్టాన్ని అర్థం చేసుకోకుండా కొందరు తప్పుగా మాట్లాడుతున్నారు. 'ఆగ్రా' కేవలం ఒక చిత్రం కాదు.. ఈ చిత్రాన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ప్రదర్శించారు. దాంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, ప్రశంసలు అందుకుంది. ఇంత గొప్ప సినిమాలో నటించినందుకు గర్వపడుతున్నాను. సినిమా శైలిని అందరూ గుర్తించాలని కోరుతున్నాను. కళ ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. కళాకారుల శ్రమను వృథా చేయకండి... సినిమా గొప్పతనాన్ని గుర్తించండి అని ఎక్స్ లో నోట్ విడుదల చేసింది." pic.twitter.com/tLDiA6eutF — Ruhani Sharma (@iRuhaniSharma) August 24, 2024 Also Read: Allu Arjun Vs Mega fans: అల్లు అభిమానులను పిచ్చికొట్టుడు కొట్టిన మెగా ఫాన్స్.. వీడియో వైరల్! - Rtvlive.com #agra-movie #ruhani-sharma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి