Stree 2: ఫైటర్, కల్కి రికార్డులు బ్రేక్.. ఫస్ట్ డే 'స్త్రీ 2' కలెక్షన్స్

శ్రద్ధా కపూర్‌ లేటెస్ట్ మూవీ 'స్త్రీ 2' తొలిరోజే సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ కల్కి, ఫైటర్ రికార్డును బ్రేక్ చేశాయి. కల్కి, ఫైటర్ ఫస్ట్ డే రూ. 22-24 కోట్లు రాబట్టగా.. 'స్త్రీ 2' రూ. 47 కోట్ల వసూళ్లు చేసింది.

Stree 2: ఫైటర్, కల్కి రికార్డులు బ్రేక్.. ఫస్ట్ డే 'స్త్రీ 2' కలెక్షన్స్
New Update

Stree 2 Day 1 Collections:  శ్రద్ధా కపూర్‌, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన లేటెస్ట్ కామెడీ హర్రర్ 'స్త్రీ 2'. ఆగస్టు 15 న విడుదలైన ఈ చిత్రం తొలిరోజే సూపర్ హిట్ రెస్పాన్స్ తో రెస్పాన్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. అంచనాలకు మించి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా డే వన్ కలెక్షన్స్ హాట్ టాపిక్ గా మారాయి.

ఫైటర్, కల్కి రికార్డులు బ్రేక్

2024 హిందీలో హృతిక్ రోషన్ 'ఫైటర్', ప్రభాస్ 'కల్కి 2898 AD' రూ. 22-24 కోట్లతో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించాయి. ఇప్పుడు 'స్త్రీ 2' దానికి డబుల్ మార్జిన్ కలెక్షన్స్ నమోదు చేసింది. ఫస్ట్ డే 47 కోట్లతో కల్కి, ఫైటర్ రికార్డును బ్రేక్ చేసింది. పెయిడ్ ప్రీమియర్స్ తో కలిపి దాదాపు రూ.55 కోట్లను  ఓపెనింగ్‌ను రాబట్టింది. ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్‌ ఓపెనర్‌గా నిలవడంతో.. టాప్ 10 హిందీ సినిమా ఓపెనర్ల జాబితాలో స్థానం సంపాదిందించి. Sacknilk నివేదిక ప్రకారం..ఈ సినిమాకు మొదటి రోజు 8 లక్షలకు పైగా టిక్కెట్లు అడ్వాన్స్‌ బుక్కింగ్ చేసినట్లు తెలుస్తోంది.

అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా త‌దిత‌రులు కీల‌క పాత్రల్లో న‌టించారు. దినేష్ విజన్ నిర్మించారు. 2018 లో భారీ విజయం సాధించిన 'స్త్రీ' సీక్వెల్ గా 'స్త్రీ 2' ను రూపొందించారు.

Also Read: Bhale Unnade : 'భలే ఉన్నాడే'.. మరో సినిమాతో సిద్దమైన రాజ్ తరుణ్ - Rtvlive.com

#stree-2-movie #stree-2-day-1-collections #actress-shraddha-kapoor
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe