/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-27T153915.558.jpg)
Mr.Bachchan: మాస్ మహారాజ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. ‘నామ్ తో సునా హోగా’ ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే సరికొత్త కాన్సెప్ట్ తో విడుదలైన ఈ మూవీ షో రీల్ సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
మిస్టర్ బచ్చన్ టీజర్
రవితేజ లెజండ్రీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ అభిమానిగా కనిపించబోతున్న 'మిస్టర్ బచ్చన్' టీజర్ రేపు (జులై 28న) విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. విజిల్స్ వేయించే మాస్ ఎంటర్టైనర్ వచ్చేస్తుంది అంటూ పోస్టర్ షేర్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. షాక్, మిరపకాయ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్- రవితేజ కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన రెప్పల డప్పుల్, సితార సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి.
On your way with a dose of whistling Mass Entertainment 🤗#MrBachchan Teaser on 28th July!
In cinemas August 15th :) pic.twitter.com/NUaoNMIRJF— Ravi Teja (@RaviTeja_offl) July 27, 2024
Also Read: Committee Kurrollu: నిహారిక కొణిదెల.. 'కమిటీ కుర్రాళ్ళు' ట్రైలర్..! - Rtvlive.com