/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-29T084647.594.jpg)
Mr.Bachchan Teaser: టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. రవితేజ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా.. విలన్ గా కీలక పాత్ర పోషించారు. రవితేజ షాక్, మిరపకాయ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
#MrBachchan reporting to duty with Honesty, Attitude & ENTERTAINMENT 😎#MrBachchanTeaser out now!
- https://t.co/ZxLywj6cslSee you all in theatres from AUGUST 15th💥 pic.twitter.com/iyEXLdw64M
— Ravi Teja (@RaviTeja_offl) July 28, 2024
మిస్టర్ బచ్చన్ టీజర్
ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ బ్యాక్ గ్రౌండ్ లో 90's మెలోడీ సాంగ్ తో టీజర్ మొదలవుతుంది. రవితేజ, భాగ్య శ్రీ బోర్సే లవ్ ట్రాక్ సన్నివేశాలు ఎంటర్‌టైనింగ్ సాగాయి. ఆ తర్వాత ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా రవితేజ ఎంట్రీ హైలెట్ గా కనిపించింది. "దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు సార్.. నల్లధనం", సక్సెస్,ఫెయిల్యూర్ చుట్టాల్లాంటివి.. వస్తుంటాయ్, పోతుంటాయ్.. యాటిట్యూడ్ ఇంటిపేరు లాంటిది. అది పోయేదాకా మనతోనే ఉంటుంది అనే డైలాగ్స్ సినిమా పై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
Also Read: VIDAAMUYARCHI : యాక్షన్ కింగ్ అర్జున్ ఫస్ట్ లుక్.. 'విదాముయార్చి' పోస్టర్ వైరల్ - Rtvlive.com