Vettaiyan Movie: గతేడాది ‘జైలర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్.. అదే జోష్ తో బాక్స్ ఆఫీస్ రికార్డులను వేటాడేందుకు ‘వెట్టయాన్’ సినిమాతో సిద్ధమవుతున్నారు. ‘జై భీం’ ఫేమ్ టి.జె.జ్ఞానవేల్- రజినీకాంత్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘వెట్టయాన్’. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రజినీ సూపర్ కాప్ గా కనిపించబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా.. తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.
పూర్తిగా చదవండి..Vettaiyan Movie: ‘వెట్టయాన్’ రిలీజ్ ఆరోజే.. దసరా బరిలో రజనీకాంత్ , సూర్య బాక్స్ ఆఫీస్ వార్
రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'వెట్టయాన్’. తాజాగా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అక్టోబర్ 10న విడుదల కానున్నట్లు తెలిపారు. అదేరోజు సూర్య 'కంగువా' కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ జరగనున్నట్లు చర్చ మొదలైంది.
Translate this News: