/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-19T134413.235.jpg)
Vettaiyan Movie: గతేడాది 'జైలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్.. అదే జోష్ తో బాక్స్ ఆఫీస్ రికార్డులను వేటాడేందుకు 'వెట్టయాన్' సినిమాతో సిద్ధమవుతున్నారు. 'జై భీం' ఫేమ్ టి.జె.జ్ఞానవేల్- రజినీకాంత్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'వెట్టయాన్'. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రజినీ సూపర్ కాప్ గా కనిపించబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా.. తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.
'వెట్టయాన్' రిలీజ్ డేట్
సూపర్ స్టార్ 'వెట్టయాన్' దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. రజినీకాంత్ కు సంబంధించిన సన్నివేశాలు పూర్తికాగా, ఇతర నటీనటులతో షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఈ చిత్రంలో మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్, కిషోర్, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Target locked 🎯 VETTAIYAN 🕶️ is set to hunt in cinemas worldwide from OCTOBER 10th, 2024! 🗓️ Superstar 🌟 as Supercop! 🦅
Releasing in Tamil, Telugu, Hindi & Kannada!#Vettaiyan 🕶️ @rajinikanth@SrBachchan@tjgnan@anirudhofficial@LycaProductions#Subaskaran@gkmtamilkumaran… pic.twitter.com/WJi2ZvpX8Z
— Lyca Productions (@LycaProductions) August 19, 2024
'వెట్టయాన్', 'కంగువా' బాక్స్ ఆఫీస్ వార్
ఇది ఇలా ఉంటే సూర్య మోస్ట్ అవైటెడ్ 'కంగువా' రిలీజ్ కూడా అక్టోబర్ 10న ఉండడం గమనార్హం. దీంతో దసరా రోజున రెండు భారీ చిత్రాల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ జరుగనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన 'కంగువా' టీజర్ కూడా సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మరి దసరా బరిలో రానున్న ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎలా అలరించనున్నాయో చూడాలి. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటాని, నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్, రవి రాఘవేంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.
 Follow Us
 Follow Us