/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-08T150044.508.jpg)
Kalki 2898 AD Collections: ప్రభాస్(Prabhas) - నాగ అశ్విన్ 'కల్కి 2898 AD' వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన మొదటి రోజు నుంచి రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. మైథాలజీ - సైన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం విపరీతమైన ప్రేక్షకాదరణ పొందుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ కల్కి ర్యాంపేజ్ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లు కలెక్ట్ చేసిన కల్కి .. తాజాగా 900 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
900 కోట్ల క్లబ్ లోకి కల్కి
తాజాగా మేకర్స్ కల్కి లేటెస్ట్ కలెక్షన్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బ్లాక్ బస్టర్ కల్కి 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 900 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. త్వరలో 1000 కోట్ల క్లబ్ లో చేరే దిశగా దూసుకెళ్తున్నట్లు చిత్ర బృందం పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ , విజువల్స్ , కథలో కొత్తదనం సినీ ప్రియులకు మంచి అనుభూతుని అందిస్తున్నాయి. నాగి సృష్టించిన ఈ కల్కి ప్రపంచం ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో కల్కి హవా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదే జోరు కొనసాగితే RRR, బాహుబలి 2, కేజీఎఫ్ (KGF) రికార్డులను బ్రేక్ చేసి కల్కి సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం.
Raging towards the magical milestone…❤️🔥#EpicBlockbusterKalki in cinemas - https://t.co/z9EmiReie8#Kalki2898AD@SrBachchan@ikamalhaasan#Prabhas@deepikapadukone@nagashwin7@DishPatani@Music_Santhosh@VyjayanthiFilms@Kalki2898AD@saregamaglobal@saregamasouthpic.twitter.com/Jyf1bAamUu
— Kalki 2898 AD (@Kalki2898AD) July 8, 2024
 Follow Us
 Follow Us