/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-06T132934.417.jpg)
Kalki 2898 AD Box Office Collections: ప్రభాస్ - నాగ్ అశ్విన్ బ్లాక్ బస్టర్ కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మైథాలజీ, సైన్స్ కలయికతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. రిలీజైన మొదటి రోజు నుంచి రికార్డు వసూళ్లతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 555 కోట్ల వసూళ్లను రాబట్టింది.
పది రోజుల్లో 800 కోట్లు
తాజాగా మేకర్స్ కల్కి 10 రోజుల కలెక్షన్స్ అఫీషియల్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. బ్లాక్ బస్టర్ కల్కి 10 రోజుల్లో 800 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. ఇదే జోరు కొనసాగితే RRR, బాహుబలి, కేజీఎఫ్ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి నిర్మించిన ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు. మాళవిక మోహన్, విజయ్ దేవరకొండ, దుల్కర్, రాజమౌళి తదితరులు కామియో రోల్స్ లో కనిపించి మెప్పించారు.
𝐓𝐇𝐄 𝐁𝐎𝐗 𝐎𝐅𝐅𝐈𝐂𝐄 𝐎𝐍 𝐅𝐈𝐑𝐄 🔥#EpicBlockbusterKalki in cinemas - https://t.co/z9EmiReie8#Kalki2898AD@SrBachchan@ikamalhaasan#Prabhas@deepikapadukone@nagashwin7@DishPatani@Music_Santhosh@VyjayanthiFilms@Kalki2898AD@saregamaglobal@saregamasouthpic.twitter.com/MexQpSHlwI
— Kalki 2898 AD (@Kalki2898AD) July 6, 2024