Rajamouli : మోడ్రన్ మాస్టర్స్.. నెట్ ఫ్లిక్స్ లో రాజమౌళి డాక్యుమెంటరీ..!

భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ధీరుడు రాజమౌళి. ఆయన సినీ జీవితం పై ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీని రూపొందించింది. మోడ్రన్ మాస్టర్స్ అనే పేరుతో ఆగస్టు 2 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

Rajamouli : మోడ్రన్ మాస్టర్స్.. నెట్ ఫ్లిక్స్ లో రాజమౌళి డాక్యుమెంటరీ..!
New Update

Netflix : భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శక ధీరుడు ఎస్‌.ఎస్ రాజ‌మౌళి (SS Rajamouli). బాహుబలి సినిమాతో జక్కన పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. ఈ చిత్రం ఏకంగా 2000 కోట్ల వరకు వసూళ్లను సాధించి బాక్స్ ఆఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. దీంతో తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. ఆ తర్వాత ఆర్ఆర్‌ఆర్‌ మూవీతో మరో సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో ఆస్కార్ (Oscar) గెలుపొందిన మొదటి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించాడు. భారతదేశంలో ఆల్ టైం అత్యధిక వసూళ్లు చేసిన దర్శకుడిగా రికార్డు క్రియేట్ చేశాడు రాజమౌళి.

publive-image

మోడ్రన్ మాస్టర్.. జక్కన్న డాక్యుమెంట్రీ

భారతీయ సినిమా (Indian Cinema) ను ప్రపంచ పటంలో నిలిపిన దర్శకు ధీరుడు రాజమౌళి సినీ జీవితం పై త్వరలో డాక్యుమెంట్రీ రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ మోడ్రన్ మాస్టర్ అనే పేరుతో రాజమౌళి సినీ జీవితాన్ని డాక్యుమెంట్రీ రూపొందించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్ . ఈ చిత్రం ఆగస్టు 2 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.

Also Read: Kalki 2898 AD: బాక్స్ ఆఫీస్ వద్ద 'కల్కి' బీభత్సం.. 10 రోజుల్లో 800 కోట్లు..! - Rtvlive.com

#ss-rajamouli #netflix #oscar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe