OTT Movies: ఈ వారం ఓటీటీలో సినిమాల సందడి ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు రాబోతున్నాయి. కమల్ హాసన్ -భారతీయుడు 2, తాప్సీ- ఫిర్ ఆయీ హసీన్ దిల్‍రూబా, మమ్ముట్టి -టర్బో, సంజయ్ దత్ - గూడ్‍చాడీ చిత్రాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. By Archana 05 Aug 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి OTT Movies: ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు చిత్రాలు క్యూ కడుతున్నాయి. కమల్ హాసన్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోల సినిమాలు ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ వారం ఓటీటీలో సందడి చేయబోయే చిత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. టర్బో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో చిత్రం టర్బో. బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది. ఆగస్టు 9నుంచి ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. మళయాళంతో పాటు తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. భారతీయుడు 2 కమల్ హాసన్ ప్రధాన పాత్రలో భారతీయుడు సీక్వెల్ గా రూపొందిన చిత్రం 'భారతీయుడు 2'. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశను మిగిల్చింది. భారతీయుడు ఎంత పెద్ద హిట్ అయ్యిందో 2 అంత డిజాస్టర్ గా అయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఫిర్ అయీ హసీన్ దిల్‍రూబా తాప్సీ పన్ను, విక్రాంత్ మాసే ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఫిర్ 'అయీ హసీన్ దిల్‍రూబా'. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని జయప్రద్ దేశాయ్ తెరకెక్కించారు. హసీన్ దుల్‍రూబాకు సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీ ఆగస్టు 9న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. గూడ్‍చాడీ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్త్, రవీనా టాండన్, ప్రథ్ సమ్తాన్, ఖుషాలీ కుమార్, అరుణా ఇరానీ ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'గూడ్‍చాడీ'. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఆగస్టు 9 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కు రానుంది. Also Read: HBD Genelia D'Souza: హ్యాపీ బర్త్ డే.. హ..హా హాసిని..! - Rtvlive.com #this-week-ott-movies మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి