Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం అప్డేట్.. నాని యాక్షన్ మోడ్..! పోస్టర్ అదిరింది

నేచురల్ స్టార్ నాని మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నాని.. చేతిలో ఆయుధంతో ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపించారు.

New Update
Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం అప్డేట్.. నాని యాక్షన్ మోడ్..! పోస్టర్ అదిరింది

Saripodhaa Sanivaaram: వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో స్టార్ హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’. భారీ అంచనాలతో రూపొందుతున్నఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల దగ్గరపడుతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ వదులుతూ ఆసక్తిని పెంచుతున్నారు మేకర్స్. తాజాగా మూవీ నుంచి నాని కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

నాని కొత్త పోస్టర్

తాజాగా విడుదలైన పోస్టర్ లో నాని లుక్ హైలెట్ గా కనిపించింది. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా కనిపించారు. చేతిలో ఆయుధంతో నాని రగ్గ్‌డ్‌ లుక్‌ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో కేవలం శనివారం మాత్రమే తన శత్రువులను అంతమొందించే వ్యక్తిగా నాని పాత్ర సరికొత్తగా ఉండబోతుంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన కన్నడ ముద్దుగుమ్మ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించగా.. స్టార్ నటుడు ఎస్‍.జే సూర్య పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన నాని పోస్టర్స్ గమనిస్తే.. సినిమాలో నాని డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Priyadarshi: లెక్కల మాస్టారుగా మారిన ప్రియదర్శి.. ‘35' సెకండ్స్ గ్లింప్స్‌ - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు