/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-26T134057.195.jpg)
Mufasa Trailer: ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ పిక్చర్స్ (Walt Disney Pictures)తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ యానిమేటెడ్ ప్రాజెక్ట్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’. బేరీ జెంకిన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ యానిమేటెడ్ చిత్రంలో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ జూనియర్ తదితర నటీనటులు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ముఫాసా ట్రైలర్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ తెలుగు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ యానిమేటెడ్ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) 'ముఫాసా' అనే కీలకమైన పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ట్రైలర్ లో ముఫాసాగా మహేష్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. అంతే కాదు బ్రహ్మానందం (Brahmanandam), అలీ (Ali) కూడా ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. 'పుంబా' పాత్రకు బ్రహ్మానందం, 'టిమోన్' పాత్రకు అలీ చెప్పారు. ఇక ట్రైలర్ లో వీరిద్దరి కామెడీ సంభాషణలు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మొత్తానికి అద్భుతమైన విజువల్స్, డైలాగ్స్ తో ట్రైలర్ హైలైట్ గా కనిపించింది.
ఈ ట్రైలర్ విడుదలైన సందర్భంగా ‘ముఫాసా’కు డబ్బింగ్ చెప్పడం పై మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు భాషలో ముఫాసాకు డబ్బింగ్ అందించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. హిందీలో ముఫాసా వాయిస్ ఓవర్ బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ చెప్పారు. ముఫాసా(లయన్) అడవికి రారాజుగా ఉంటాడు. బాల్యం నుంచి అడవికి రాజుగా ఎదగడం వరకు ముఫాసా జీవితం ఎలా సాగింది అనేది సినిమాలో ఉండబోతుంది.
A new dimension to the character we know and love! Extremely excited to be the voice of Mufasa in Telugu and having been a massive fan of the classic, this is a special one for me!
Long live the king ♥️@DisneyStudiosIN pic.twitter.com/9LdAX6qexT
— Mahesh Babu (@urstrulyMahesh) August 26, 2024
Also Read: Kannappa : 'తిన్నడు' పాత్రలో మంచు విష్ణు కొడుకు.. కన్నప్ప అప్డేట్ - Rtvlive.com