Turbo Movie : ఓటీటీలో మమ్ముట్టి మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ట‌ర్బో. ఈ ఏడాది మే 23న విడుద‌లైన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 9 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్.

New Update
Turbo Movie : ఓటీటీలో మమ్ముట్టి మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..

Turbo Movie OTT Streaming On 9th August :  మలయాళ స్టార్ నటుడు ముమ్ముట్టి(Mammootty) నటించిన లేటెస్ట్ మూవీ 'టర్బో' (Turbo). మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. 70 కోట్ల వ‌సూళ్లను రాబ‌ట్టింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

టర్బో ఓటీటీ రిలీజ్

తాజాగా టర్బో ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీ లివ్‌ (Sony Liv) లో మ‌ల‌యాళం, తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ కమెడియన్ సునీల్, క‌న్న‌డ యాక్టర్ రాజ్‌బీ శెట్టి విలన్స్ గా నటించారు. ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు.

Also Read: HBD Taapsee Pannu: నాజూకు నడుము.. యాక్టింగ్‌లో తోపు.. హ్యాపీ బర్త్‌డే తాప్సి! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు