Kiara Advani: ఎన్టీఆర్ జోడిగా రాంచరణ్ హీరోయిన్..? వార్ 2 అప్డేట్ వైరల్

హృతిక్ రోషన్- ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'వార్2'. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరలవుతోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా ఈ మూవీలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ లేదా హృతిక్ జోడీగా నటించనున్నట్లు సమాచారం.

Kiara Advani: ఎన్టీఆర్ జోడిగా రాంచరణ్ హీరోయిన్..? వార్ 2 అప్డేట్ వైరల్
New Update

Kiara Advani: కియారా అద్వానీ ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో భారీ ప్రాజెక్ట్ లో భాగమైనట్లు నెట్టింట వార్తలు వైరలవుతున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వార్ 2' లో ఫీమేల్ లీడ్ గా ఎంట్రీ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక హృతిక్ రోషన్ కు జోడిగానా..? లేక ఎన్టీఆర్ కు జోడిగానా..? అనే దానిపై క్లారిటీ లేదు. ఇందులో కియారా హై యాక్షన్ సన్నివేశాల్లో కనిపించనుందని సమాచారం.

Kiara Advani Kiara Advani

'వార్ 2'

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'వార్ 2'. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ గా 2019 లో భారీ విజయం సాధించిన 'వార్' సీక్వెల్ గా 'వార్ 2' రూపొందుతోంది. దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఈ సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. 'వార్ 2' స్క్రిప్ట్ పై అయాన్ ముఖర్జీ, ఆదిత్య చోప్రా చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేసినట్లు తెలుస్తోంది. ప్రీక్వెల్ ను మించి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల మధ్య భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే  యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇక ఇప్పుడు 'వార్ 2' కూడా అంచనాలను మించి ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

Also Read: Stree 2: బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 'స్త్రీ 2' హవా.. నాలుగు రోజుల్లో భారీ వసూళ్ళు.! - Rtvlive.com

#kiara-advani-in-war-2 #war-2-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe