Vidaa Muyarchi: ‘విడాముయ‌ర్చి’ నుంచి త్రిష లుక్.. వైరలవుతున్న పోస్టర్

త‌మిళ స్టార్ అజిత్‌ కుమార్‌ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విడాముయ‌ర్చి’. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. తాజాగా మూవీ నుంచి త్రిష లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

New Update
Vidaa Muyarchi: ‘విడాముయ‌ర్చి’ నుంచి త్రిష లుక్.. వైరలవుతున్న పోస్టర్

Vidaa Muyarchi:  తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌, త్రిష జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విడాముయ‌ర్చి’. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్ అర్జున్, రెజీనా కసాండ్రా, అరవ్‌ కిజర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ ప్రమోషనల్ కంటెంట్ విపరీతమైన హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

త్రిష ఫస్ట్ లుక్

‘విడాముయ‌ర్చి’ త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అజిత్ త్రిష భార్య భ‌ర్త‌లుగా నటించబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఎంత వాడు గాని తర్వాత అజిత్- త్రిష కాంబోలో రాబోతున్న ఈ మూవీ పై ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ విలన్‌గా పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.

Also Read: Ananya Nagalla: పవన్ కళ్యాణ్ ఆద్యను అలా పట్టుకోగానే నేను షాక్..! ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ తో.. - Rtvlive.com


Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు