Lucky Baskhar: 'లక్కీ భాస్కర్' మరో సారి వాయిదా.. పోస్టర్ వైరల్

దుల్కర్ సల్మాన్ నటిస్తున్నలక్కీ భాస్కర్ చిత్రాన్ని మరో సారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 7కు ప్రీపోన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ ఫోన్ చేస్తూ అక్టోబర్ 31న రిలీజ్ కానుందని ట్వీట్ చేశారు.

New Update
Lucky Baskhar: 'లక్కీ భాస్కర్' మరో సారి వాయిదా.. పోస్టర్ వైరల్

Lucky Baskhar: వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్‌’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ  మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో దుల్కర్ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించి ఆకట్టుకున్నారు. ఒక సాధారణ మధ్యతరగతి బ్యాంక్ ఉద్యోగి ఖాతాలోకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే సస్పెన్స్ తో ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచింది.

'లక్కీ భాస్కర్' మళ్ళీ పోస్ట్ ఫోన్

ఇక సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ షాకిచ్చారు. విడుదలను మరో సారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. కానీ బాక్సాఫీస్ ఫైట్‌ను దృష్టిలో పెట్టుకొని ఊహించని విధంగా సినిమాను సెప్టెంబర్ 7కు ప్రీపోన్ చేశారు. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ ఫోన్ చేస్తూ.. అక్టోబర్ 10న గ్రాండ్ గా విడుదల కానున్నట్లు ట్వీట్ చేశారు.

మేకర్స్ ఇలా ట్వీట్ చేశారు.. విడుదలను వాయిదా వేయడం సోషల్ మీడియాలో ప్రభావం చూపుతుంది.. కానీ సినిమా నాణ్యతకు ఇది చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో మీ దీపావళిని ప్రత్యేకంగా జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. 'లక్కీ భాస్కర్' అక్టోబర్ 10న గ్రాండ్ గా విడుదల కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు.

Also Read:  Samantha: "సంథింగ్ స్పెషల్" అంటూ సమంత పోస్ట్ ...పెళ్లి గురించేనా..? - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు