Raayan Movie: 'రాయన్' డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ 'రాయన్‌'. జులై 26న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. రాయన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సన్ నెక్స్ట్ దక్కించుకున్నట్లు సమాచారం.

New Update
Raayan Movie: 'రాయన్' డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Raayan Movie: హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ 'రాయన్'. నార్త్ మద్రాస్‌ బ్యాక్ డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో జులై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా విమర్శకుల నుంచి మంచి రివ్యూస్ పొందుతోంది. ఈ మూవీలో ధనుష్ తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా కీలక పాత్ర పోషించాడు.

రాయన్ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్

తాజాగా 'రాయన్' ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ సన్ నెక్స్ట్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక స్ట్రీమింగ్ డేట్ వివరాలకు సంబంధించి త్వరలో మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, దుషారా విజయన్‌ కథానాయికలుగా నటించగా.. ప్రకాశ్‌ రాజ్‌, ఎస్‌జే సూర్య , కాళిదాస్ జయరామన్‌, సెల్వ రాఘవన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

Also Read: Rajinikanth: మనవడిని స్కూల్‌కు తీసుకెళ్లిన తలైవా.. ఫొటోలు వైరల్..! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు