Brahmamudi: అప్పుకు పెళ్లి చూపులు.. కళ్యాణ్ ముందు నిజం బయటపెట్టిన రాజ్..!

నేటి బ్రహ్మముడి ఎపిసోడ్ లో అప్పుకు పెళ్లి చూపులు ఆరెంజ్ చేస్తుంది కనకం. మరో వైపు రాజ్ కళ్యాణ్ కు అప్పు పై ఉన్న ప్రేమను ఎలాగైనా బయటపెట్టాలని ప్రయత్నిస్తాడు. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

Brahmamudi: అప్పుకు పెళ్లి చూపులు.. కళ్యాణ్ ముందు నిజం బయటపెట్టిన రాజ్..!
New Update

Brahmamudi Serial: కళ్యాణ్ అప్పు కోసం రాసిన ప్రేమ కవితను చూస్తూ ఆమెను గుర్తుచేసుకొని బాధపడతాడు. అప్పు తనను కలవద్దని చెప్పిన తర్వాత కూడా తనపై నాకున్న అభిప్రాయాన్ని చెప్పడం కరెక్ట్‌ కాదు అనుకోని తాను రాసిన కవితను మడిచి పక్కకు పడేస్తాడు.

publive-image

ఇదంతా గమనించిన రాజ్ వెళ్లి కవిత రాసిన ఆ పేపర్ తీసుకొని చదువుతాడు. ఆ కవితలో కళ్యాణ్ కు అప్పు పై ఉన్న ప్రేమను తెలుసుకుంటాడు రాజ్. ఇక ఎలాగైనా అప్పు, కళ్యాణ్ ను ఒకటి చేయాలని నిర్ణయించుకుంటాడు.

publive-image

మరో వైపు అప్పుకు మంచి సంబంధం వచ్చిందని భర్త కృష్ణమూర్తితో చెబుతుంది కనకం. ఇక కృష్ణమూర్తి ఈ విషయం ముందు అప్పుకు చెప్పవా అని అంటాడు. ఇంతలో అప్పు అక్కడికి వస్తుంది. దీంతో కనకం చెప్పింది అంతా విన్నావు కదా అప్పు నీకు పెద్దమ్మ మంచి సంబంధం చూసింది ఏమంటావు అని అడుగుతుంది. దానికి అప్పు.. నేను ఏ నిర్ణయం తీసుకోవాలని అనుకోవట్లేదు. అంతా మీ ఇష్టం అని చెప్తుంది.

publive-image

ఇక అప్పు పెళ్లికి ఒప్పుకోవడంతో తెగ ఆనందపడుతుంది కనకం. వెంటనే కావ్య ఫోన్ చేసి విషయం చెప్తుంది. అప్పు పెళ్లి చూపుల కోసం కావ్య, స్వప్నను ఇంటికి రమ్మని చెప్తుంది. ఈ విషయాన్ని కావ్య రాజ్ తో కూడా చెప్తుంది.

publive-image

కళ్యాణ్ ప్రేమ గురించి తెలుసుకున్న రాజ్ అప్పుకు పెళ్లి సంబంధం వచ్చింది అని చెప్పగానే కంగారు పడతాడు. ఆ తర్వాత కళ్యాణ్ దగ్గరికి వెళ్లి అప్పు పై ఉన్న ప్రేమను బయటపెట్టాలని చూస్తాడు. కావాలనే కళ్యాణ్ ముందు అప్పుకు మంచి పెళ్లి సంబంధం వచ్చింది. ఇంత కాలం అప్పు పై పడిన నిందలు అన్ని తొలగిపోతాయి. తాను సంతోషంగా ఉంటుంది అని అంటాడు రాజ్. ఇక కళ్యాణ్ మాత్రం మనసులో బాధపడుతూ ఉంటాడు.

publive-image
ఇక అప్పుకు పెళ్లి చూపులు అని తెలిసి ఆమెను కలవడానికి వస్తాడు బంటి . నువ్వు చేస్తుంది తప్పు అక్క. కళ్యాణ్ ను పెళ్లి చేసుకో అక్క అని చెప్తాడు బంటి. దానికి అప్పు వాడు కూడా ఇష్టపడాలి కదా. కళ్యాణ్ నన్ను ఫ్రెండ్‌ లాగే చూశాడు అని బాధపడుతుంది.

publive-image

మరో వైపు అప్పును పెళ్లి కూతురుగా రెడీ చేస్తుంటారు కావ్య, స్వప్న. కానీ అప్పు మాత్రం డల్ గా కనిపించడంతో కావ్య, స్వప్న అనుమాన పడతారు. కొంపదీసి పెళ్లంటే ఇష్టం లేదా ఏంటి అని అప్పును అడుగుతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

publive-image

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‏తో అనసూయ స్టెప్పులు.. పాట మోత మోగిపోద్ది అంతే..! - Rtvlive.com

#brahmamudi-serial #brahmamudi-today-episode
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe