Tripti Dimri : యనిమల్ పార్క్ సినిమా డేట్ ఫిక్స్.. రిలీజ్ అప్పుడే.. నేషనల్ క్రష్ కామెంట్స్!

యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో 'యానిమల్ పార్క్'మూవీ పై స్పందించింది. ప్రేక్షకుల మాదిరిగానే యానిమల్ పార్క్ ఎప్పుడు మొదలవుతుందో తనకూ తెలియదని. ఆ సినిమా కథేంటి..? షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది..? అనే విషయాల పై ఏ మాత్రం ఐడియా లేదని చెప్పింది.

New Update
Tripti Dimri : యనిమల్ పార్క్ సినిమా డేట్ ఫిక్స్.. రిలీజ్ అప్పుడే.. నేషనల్ క్రష్ కామెంట్స్!

Tripti Dimri Interesting Comments On Animal Park Movie : బాలీవుడ్ (Bollywood) బ్యూటీ త్రిప్తి దిమ్రీ (Tripti Dimri) ‘యానిమల్‌’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయింది. ఈ సినిమాలో జోయా పాత్రలో కనిపించిన త్రిప్తి యువత హృదయాలను దోచేసింది. యానిమల్ తో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ కుర్రాళ్ళ నయా నేషనల్ క్రష్ గా మారింది.

త్రిప్తి కామెంట్స్

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి యానిమల్ (Animal) చిత్రానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. త్రిప్తి మాట్లాడుతూ.. యానిమల్ తన కెరీర్ కు ఎంతో ఉపయోగపడిందని. ఆ సినిమా తర్వాత తనకు అభిమానులు కూడా ఎక్కువయ్యారని. ఆమె గత చిత్రాలను కూడా చూస్తున్నారని తెలిపింది. ఈ సినిమాలో ఎంతో మంది గొప్ప యాక్టర్స్ తో వర్క్ చేయడం వల్ల ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నానని. సినిమా పై విమర్శలు వచ్చిన విషయం వాస్తవమే. సినీ రంగంలో ఇలాంటివి సాధారణమేనని. ప్రతీ ఒక్కరు ఎదో ఒక సందర్భంలో ఇలాంటివి ఎదుర్కునే ఉంటారని చెప్పుకొచ్చింది.

publive-image

యానిమల్ పార్క్ పై త్రిప్తి కామెంట్స్

అలాగే త్రిప్తి 'యానిమల్ పార్క్' పై కూడా స్పందించారు. యానిమల్ సీక్వెల్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'యానిమల్ పార్క్' రాబోతున్న సంగతి తెలిసిందే. త్రిప్తి 'యానిమల్ పార్క్' గురించి మాట్లాడుతూ.. "వాస్తవానికి ప్రేక్షకుల మాదిరిగానే యానిమల్ పార్క్ షూట్ ఎప్పుడు మొదలవుతుందో తనకూ తెలియదని. ఆ సినిమా కథేంటి..? షూటింగ్ కు సంబంధించిన విషయాల గురించి ఎలాంటి ఐడియా లేదని చెప్పింది." త్రిప్తి తాజాగా ‘బ్యాడ్ న్యూస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీ జంటగా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకులు కూడా సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: Mr.Bachchan Teaser: లవ్, యాక్షన్, డైలాగ్స్.. మిస్టర్ బచ్చన్ టీజర్ అదిరింది..! - Rtvlive.com


Advertisment
తాజా కథనాలు