Janhvi Kapoor: జాన్వీ గురించి అలా మాట్లాడలేదు.. క్లారిటీ ఇచ్చిన హీరో గుల్షన్..!

బాలీవుడ్ నటుడు గుల్షన్‌ దేవయ్య, జాన్వీ కపూర్ కలిసి నటించిన తాజా చిత్రం ‘ఉలఝ్‌’. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు గుల్షన్‌ జాన్వీ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చిత్రీకరణ సమయంలో తనతో మాట్లాడేదని. జాన్వీతో తనకు ఫ్రెండ్లీ రిలేషన్‌ లేదని చెప్పారు.

New Update
Janhvi Kapoor: జాన్వీ గురించి అలా మాట్లాడలేదు.. క్లారిటీ ఇచ్చిన హీరో గుల్షన్..!

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, గుల్షన్ దేవయ్య జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉలఝ్‌’. ఒక IFS ఆఫీసర్ కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి సుధాన్షు సరియా దర్శకత్వం వహించారు. స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీలో రాజేంద్ర గుప్తా, రాజేష్ తైలాంగ్, ఆదిల్ హుస్సేన్, మీయాంగ్ చాంగ్, జితేంద్ర జోషి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆగస్ట్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గుల్షన్ కామెంట్స్ 

అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నటుడు గుల్షన్ దేవయ్య జాన్వీ కపూర్‌తో తన సాన్నిహిత్యం గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. జాన్వీతో తనకు ఫ్రెండ్లీ రిలేషన్‌ లేదని. షూటింగ్ సమయంలోనే తనతో మాట్లాడేదని కామెంట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింట చర్చనీయం కాగా.. నటుడు గుల్షన్ వీటిపై క్లారిటీ ఇచ్చారు.

నటుడు గుల్షన్ క్లారిటీ

ఈ వ్యాఖ్యల పై స్పందించిన గుల్షన్.. తాను జాన్వీ గురించి తప్పుగా మాట్లాడలేదని. కేవలం తామిద్దరి మధ్య స్నేహం లేదన్నాని తెలిపారు. "జాన్వీ మంచి నటి. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు బాగా వచ్చాయి. ఆమె చాలా ప్రొఫెషనల్ గా నటిస్తారు. ప్రతి సినిమా సెట్స్ లో మూవీ టీమ్ అంతా కుటుంబంలా కలిసిపోవాలని లేదు కదా, నేను ఎవరినీ కించపరచలేదు. దర్శకుడు చెప్పింది చేశాము. సినిమా కోసం 100 పర్సెంట్ ఇచ్చాము. గతంలో చాలా హీరోయిన్స్ నేను స్క్రీన్ షేర్ చేసుకున్నాను. వారందరితో నాకు మంచి స్నేహం ఉంది. మేము ఎన్నో విషయాల గురించి చర్చించే వాళ్ళము. కానీ జాన్వీ, నేను మాత్రం కేవలం సినిమా గురించి మాత్రమే చర్చించే వాళ్ళము. అదే విషయాన్ని ఇంటర్వ్యూ లో చెప్పానని గుల్షన్‌ తెలిపారు."

Also Read: Tripti Dimri: వైట్ బాడీకాన్ గౌనులో త్రిప్తి అందాల విధ్వంసం..! చూస్తే ఫిదా - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు