Suriya44 First Look: తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'కంగువ' సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నారు.
'సూర్య 44' ఫస్ట్ లుక్
ఇది ఇలా ఉంటే తాజాగా సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘జిగర్ తండా డబుల్ ఎక్స్' ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు- సూర్య కాంబోలో 'సూర్య 44' వర్కింగ్ టైటిల్ తో ఓ రూపొందుతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నేడు సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. 'ఒకరి కోసం ప్రేమ, నవ్వు, యుద్ధం ఎదురుచూస్తున్నాయి'' అనే క్యాప్షన్ తో గ్లింప్స్‌ను విడుదల చేస్తూ.. బర్త్‌డే విషెస్ తెలిపారు. ఇందులో సూర్య గన్ పట్టుకొని వస్తున్న విజువల్స్ హైలెట్ గా కనిపించాయి.
2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే కథానాయికగా నటించగా.. జార్జ్, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ అండమాన్ ఐలాండ్ లో షూటింగ్ జరుపుకుంటోంది.
Happy Birthday @Suriya_offl Sir
From Team #Suriya44 #HappyBirthdaySuriya #HBDTheOneSuriya pic.twitter.com/PuyM43y4rl— karthik subbaraj (@karthiksubbaraj) July 22, 2024
Also Read: Tripti Dimri: వైట్ బాడీకాన్ గౌనులో త్రిప్తి అందాల విధ్వంసం..! చూస్తే ఫిదా - Rtvlive.com