Maruthi Nagar Subramanyam: ఫుల్ ఫన్.. రావు రమేష్ 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ట్రైలర్'

ప్రముఖ నటుడు రావు రమేష్ లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. కామెడీ ఎంటర్‌‌‌‌ టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ కార్య తెరకెక్కించారు. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రావు రమేష్ కామెడీ టైమింగ్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

Maruthi Nagar Subramanyam: ఫుల్ ఫన్.. రావు రమేష్ 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ట్రైలర్'
New Update

Maruthi Nagar Subramanyam Trailer: టాలీవుడ్ ప్రముఖ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం'. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రావు రమేష్- ఇంద్రజ భార్య భర్తలుగా నటించగా.. అంకిత్ కొయ్య కొడుకుగా నటించాడు. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం ఆగస్టు 23న విడుదల కానుంది.

మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ట్రైలర్

ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ లో రావు రమేష్ కామిక్ టైమింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన కామెడీ టైమింగ్, వన్-లైనర్‌లు నవ్వులు పూయించాయి. మధ్య తరగతి తండ్రి కొడుకుల మధ్య జరిగే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, రమ్య పసుపులేటి, హర్ష వర్ధన్, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read: Urvashi Rautela: ఆ బాత్‌రూమ్‌ వీడియో నాదే.. ఊర్వశి రౌతేలా రియాక్షన్..! - Rtvlive.com

#rao-ramesh #maruthi-nagar-subramanyam-trailer
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe