/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-30T120645.030.jpg)
Maruthi Nagar Subramanyam Trailer: టాలీవుడ్ ప్రముఖ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం'. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రావు రమేష్- ఇంద్రజ భార్య భర్తలుగా నటించగా.. అంకిత్ కొయ్య కొడుకుగా నటించాడు. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం ఆగస్టు 23న విడుదల కానుంది.
#MaruthiNagarSubramanyam is the most happening celebrity in everyone's phone 💥💥💥#MNSTrailer Trending Top on YouTube ❤️🔥
▶️ https://t.co/stoBXt77MlIn cinemas on August 23rd.@thabithasukumar Presents,
Release by @mythrirelease#RaoRamesh #Indraja
Directed by… pic.twitter.com/Symjy37p48— Sukumar Writings (@SukumarWritings) July 29, 2024
మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ట్రైలర్
ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ లో రావు రమేష్ కామిక్ టైమింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన కామెడీ టైమింగ్, వన్-లైనర్‌లు నవ్వులు పూయించాయి. మధ్య తరగతి తండ్రి కొడుకుల మధ్య జరిగే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, రమ్య పసుపులేటి, హర్ష వర్ధన్, అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read: Urvashi Rautela: ఆ బాత్‌రూమ్ వీడియో నాదే.. ఊర్వశి రౌతేలా రియాక్షన్..! - Rtvlive.com