T20 World Cup 2024: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే.. జోఫ్రా రీ ఎంట్రీ! డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్ బరిలో దిగబోయే తుది జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్‌ను జోస్ బట్లర్ ముందుండి నడిపించనున్నాడు. గాయం కారణంగా కొన్ని నెలలు ఆటకు దూరమైన జోఫ్రా అర్చర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. By srinivas 30 Apr 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మెగా టోర్నీ కోసం భారత్ తో పాటు మరిన్ని దేశాలు తమ జట్లను దాదాపు ఖరారు చేశాయి. అయితే తాజాగా పొట్టి కప్ సమరంలోకి దిగబోయే గెలుపు గుర్రాల లిస్ట్ ఇంగ్లాండ్ రిలీజ్ చేసింది. Our ICC Men's T20 World Cup squad looking 🔥🔥🔥 Who are you most looking forward to seeing? 👇#EnglandCricket | @T20WorldCup pic.twitter.com/48Q6pO2CzE — England Cricket (@englandcricket) April 30, 2024 జోఫ్రా అర్చర్ రీ ఎంట్రీ.. ఈ మేరకు జూన్ 2 నుంచి యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుండగా.. ఇప్పటికే న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించాయి. అయితే డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనున్న ఇంగ్లాండ్‌ను జోస్ బట్లర్ ముందుండి నడిపించనున్నాడు. గాయం కారణంగా కొన్ని నెలలుగా ఆటకు దూరమైన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా అర్చర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇది కూడా చదవండి: Airports: ఇండియాలోని 24 విమానాశ్రయాలకు ఉగ్ర ముప్పు.. ‘టెర్రరైజర్స్ 111’ నుంచి మెయిల్! ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా అర్చర్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, అదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్. #t20-world-cup-2024 #england #south-africa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి