Liquor Scam: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి ఈడీ బృందం..అరెస్టుకు రంగం సిద్ధం?

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. 12 మంది అధికారుల టీం ఆయన ఇంట్లో సోదారులు నిర్వహిస్తున్నారు. కేజ్రీవాల్ ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీంతో కేజ్రీవాల్ నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.

CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఎదురుదెబ్బ
New Update

ED Officers At CM Arvind Kejriwal House: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు చేరుకున్నారు. దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సీఎం నివాసం దగ్గర సిబ్బంది ఆరా తీయగా..సెర్చ్ వారెంట్ తోనే వచ్చామని చెప్పినట్లు సమాచారం. మద్యం పాలసీకి (Liquor Policy) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే 9సార్లు ఈడీ సమన్లు ఇచ్చినా కూడా కేజ్రీవాల్ హజరయ్యేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. సీఎం ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కాగా మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో (Money Laundering Case) కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఈ రోజు ఉపశమనం లభించలేదు. ఈ కేసులో ఆయనకు అరెస్టు నుంచి మినహాయింపు కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి నేపథ్యంలో ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పిన కొన్ని గంటల్లోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకోని సోదాలు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

#delhi-liquor-scam-case #delhi-cm-kejriwal #ed
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe